Moviesసినిమా ఫ్లాప్ కాలేదు..అయ్యేలా చేశారు..ఫస్ట్ టైం ఎమోషనల్ అయిన ప్రభాస్..?

సినిమా ఫ్లాప్ కాలేదు..అయ్యేలా చేశారు..ఫస్ట్ టైం ఎమోషనల్ అయిన ప్రభాస్..?

ప్రభాస్ అభిమానులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ.. ఊరిస్తూ ఊరిస్తూ రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా “రాధే శ్యామ్”. రాధ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మార్చి 11న ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజై.. మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించగా, పూజా డాక్టర్‌ ప్రేరణ పాత్ర పోషించింది.

సినిమాలో పెద్దగా స్టోరీ లేకపోవడం..చిన్న సీన్స్ కోసం కూడా కోట్లకి కోట్లు ఖర్చు చేయడం..అన్నింటికన్నా మెయిన్ మైనస్ పాయింట్ ఇలాంటి ఓ కధను ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో తో తెరకెక్కించడం.. అని అంటున్నారు అభిమానులు. దీని పై ఇప్పటికే నెట్టింట పలు రకాల మీమ్‌స్ తో ప్రభాస్ ని ఆడేసుకుంటున్నారు ట్రోలర్స్. సినిమా తెరకెక్కించిన రాధా కృష్ణని..సినిమాలో హీరో గా నటించిన ప్రభాస్ పై పిచ్చ గా ట్రోల్ చేస్తున్నారు.

ఇక వీటి రీసెంట్ గానే డైరెక్టర్ స్పందించి..ఫస్ట్ నుండి మేము చెప్పుతూనే ఉన్నాము ఇది ఓ లవ్ స్టోరీ అని..ప్రేమ కధలో ఫైట్ లు ..కొట్టుకోవడం పెడితే వెజిటేరీయన్ హొటల్లో నాన్ వేజ్ పెట్టిన్నట్లే అంటూ ఘాటుగా బదులిచ్చాడు. అయితే నెట్టింట మితి మీరిన ట్రోలింగ్ పై ప్రభాస్ కూడా మండిపడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో అన్ని బాగున్నాయి అని..టోటల్ లైన్ మొత్తం ప్రేమ పై ఆధారపడి తెరకెక్కించారని..ఈ సినిమా జనాలకు కూడా బాగా నచ్చిందని,

కానీ..కొందరు కావాలనే ఆయన సినిమా పై ఇలాంటి బ్యాడ్ టాక్ ని క్రియేట్ చేస్తున్నారని సన్నిహితుల వద్ద ఫైర్ అవుతూ ఎమోషనల్ అయ్యారట ఫ్రభాస్. అంతేకాదు ఈ సినిమా కోసం ఎంత కష్టపడామో మాకు మాత్రమే తెలుసు…. ఒక స్వచ్చమైన ప్రేమ కధని ఇంత దారుణంగా ట్రోల్ చేయడం ఆయనకి నచ్చలేదట. రాధకు కాల్ చేసి మరీ సినిమా టాక్ ను పట్టించుకోకు..సినిమా వల్ల నేను హ్యాపీ డార్లింగ్ అంటూ చెప్పుకొచ్చారట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news