ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌లు, హీరోలను ఒంటరిగా రమ్మనడాలు ఇలా చాలా కథలే నడుస్తూ ఉంటాయి. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ సైతం తనకు ఓ హీరో నుంచి ఎదురైన అనుభవాన్ని షేర్ చేసుకుంది. నాగార్జున హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చంద్రలేఖ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణతో పాటు ఇషా కొప్పికర్ కూడా నటించింది. ఈ సినిమాలో రమ్య – ఇషా అక్కా చెళ్లెల్లుగా నటించారు. ఆ తర్వాత ఇషా వెంకటేష్ పక్కన ప్రేమతో రా, కేశవ సినిమాల్లోనూ కనిపించింది.
తాజాగా ఇషా కొప్పికర్ చేసిన వ్యాఖ్యలు వేడెక్కిస్తున్నాయి. తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని.. ఓ హీరోని ఒంటరిగా కలిసేందుకు తాను ఒప్పుకోకపోవడంతో తనను ఆ సినిమా నుంచే తొలగించేశారని నాటి సంఘటన గుర్తు చేసుకుని వాపోయింది. ఇషా కొప్పికర్ బాలీవుడ్ హీరోయిన్. 1990 నుంచి 2000 వరకు బాలీవుడ్‌తో పాటు కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. 2000 టైంలో తనకు ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చిందని.. అయితే సదరు హీరో తనను ఒంటరిగా కలిసేందుకు రూమ్‌కు రమ్మన్నారని.. అందుకు తాను ఒప్పుకోకపోవడంతో తనను ఆ సినిమా నుంచి తప్పించేసి తన ప్లేస్‌లో ఓ నటుడి కుమార్తెను తీసుకున్నారని చెప్పింది.
ఇక చాలా గ్యాప్ తర్వాత ఇషా కొప్పికర్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ యేడాది విడుల అయ్యేందుకు కొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక 2000 టైంలో ఇషా నటించిన
ఏక్ థా దిల్ ఏక్ థీ ధడ్కన్ – ఫిజా- ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్- కంపెనీ- కాంటే- పింజర్ -దిల్ కా రిష్తా లాంటి సినిమాల్లో నటించింది. 2009లో ఆమె టిమ్మీ నారంగ్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కుమార్తె రియానా పుట్టడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది.
ఇక తనకు మంచి ఛాన్సులు వచ్చినా ఆశ్రిత పక్షపాతంతో పాటు కాస్టింగ్ కౌచ్ బాధితురాలిని కావడం.. అందుకు ఒప్పుకోకపోవడంతోనే తాను చాలా సినిమాలు వదులుకున్నానని చెప్పింది. ఇక ఓ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినప్పుడు ఓ నిర్మాత ఫోన్ చేసి హీరోతో మంచిగా ఉండాలని.. అతడిని ఒంటరిగా కలువాలని కూడా చెప్పాడని.. ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఇషా తెలిపింది. అయితే సదరు స్టార్ హీరో ఎవరు ? అన్నది మాత్రం ఇషా చెప్పలేదు.