ప్రముఖ టీవీ నటి నిషా రావల్ తన మాజీ భర్త, నటుడు కరణ్ మొహ్రాతో విడాకుల గురించి మరోసారి స్పందించి. కంగనా రనౌత్ హోస్ట్ చేస్తోన్న టాక్ షో లాక్అప్ రియాలిటీ షోలో నిషా పాల్గొంది. ఈ షోలో నిషా గతేడాది తన జీవితంలో జరిగిన పెద్ద కుదుపు గురించి సంచలన విషయాలు వెల్లడించింది. తన భర్త విడాకుల గురించి మాట్లాడుతూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైంది.
పాయల్ రోహత్గీతో వివాహేతర సంబంధం అనంతరం తన భర్త తనను ఒంటరిగా వదిలేసి తన కుమారుడు కవిష్ణు తీసుకుని ముంబై వెళ్లిపోయాడని ఆమె కన్నీరు మున్నీరుగా వాపోయింది. పాయల్ – కరణ్ సీక్రెట్‌గా మాట్లాడుకోవడం చూసిన వెంటనే తనకు అనుమానం వచ్చిందని.. తాను కరణ్‌ను నిలదీయడంతో తాను మరొకరితో ప్రేమలో ఉన్నానని చెప్పి తన హృదయం బద్దలయ్యేలా చేశాడని ఆమె బాధతో చెప్పింది.
గత ఐదారు నెలలుగా తాను పాయల్ సీక్రెట్ రిలేషన్లో ఉన్నాము.. నేను తననే ప్రేమిస్తున్నాను.. అలాగే నిన్ను కూడా ఇష్టపడుతున్నాను అనడంతో తన భర్త కరణ్ మాటలు నన్ను ఎంతో బాధించాయని ఆమె చెప్పింది. ఈ వివాహేతర సంబంధం బయటకు వచ్చాక తనకు, కరణ్‌కు మధ్య ఎన్నో గొడవలు అయ్యాయని.. కరణ్ నన్ను భౌతికంగానే కాకుండా, మానసికంగాను హింసించాడని వాపోయింది.
పైగా తాను మీడియా ముందుకు వస్తే.. కూడా కెచప్ రాసుకుని నాటకాలు ఆడుతూ దారుణంగా ట్రోల్ చేశారని.. ఈ సమాజం కూడా నన్ను నిందించిందని చెప్పింది. ఇక గతేడాదే నిషా రావల్ – కరణ్‌ల విడాకుల వ్యవహారం బీ టౌన్లో హాట్ టాపిక్‌గా మారిందని.. భర్త తనను వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులను, మీడియాను ఆశ్రయించింది. ఈ కేసులో అరెస్టు అయ్యి జైలకు వెళ్లిన కరణ్ మెహ్రా ఇటీవల బెయిల్‌పై బయటకు కూడా వచ్చాడు.