ప్రస్తుతం టాలీవుడ్లో అమ్మ పాత్రలో మంచి నటి కావాలన్నా.. మంచి వదిన క్యారెక్టర్ కావాలన్నా ముందుగా గుర్తొచ్చేది పవిత్రా లోకేష్. ఓ అమ్మ క్యారెక్టర్ చాలా పవిత్రంగా.. సైలెంట్‌గా కనిపించాలంటే పవిత్రా లోకేషే మనోళ్లకు ఫస్ట్ ఆప్షన్. ఇలాంటి పాత్రల్లో ఆత్మాభిమానం ఉన్న అమ్మగాను.. చాలా గ్రేష్ఫుల్గా పవిత్ర ఉంటుంది. నాలుగున్నర పదుల వయస్సులో ఉన్న పవిత్ర చాలా యేళ్లుగా సినిమా రంగంలో కొనసాగుతున్నారు. గతంలో హీరోయిన్గా చేసిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నారు.
ఇక మన టాలీవుడ్ కింగ్ నాగార్జున పవిత్రకు ఫస్ట్ క్రష్ అట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె 6 – 7 తరగతుల్లో ఉన్నప్పుడు మణిరత్నం దర్శకత్వంలో నాగ్ – గిరిజ జంటగా నటించిన గీతాంజలి సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమాతోనే నాగార్జునకు రొమాంటిక్ ఇమేజ్ వచ్చింది. ఎంతో మంది కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు కాలేజ్ ఎగ్గొట్టి మరీ సినిమా చూసేవాళ్లు. మరి కొందరు అయితే ఆ సినిమా చూసే ప్రేమలో పడి.. పెళ్లి చేసుకున్నారు కూడా..! అప్పట్లో ఇదో ట్రెండ్ సెట్టర్.
కరెక్టుగా పవిత్ర 6-7 తరగతులు చదువుతున్న టైంలో ఆ సినిమా రావడంతో ఆమె కూడా నాగార్జునకు పడిపోయారట. నా లైఫ్‌లో కూడా ఇలాంటి మ్యాన్ ఉంటే బాగుంటుందన్న ఫీలింగ్ ఆమెకు నాగార్జునను చూశాకే ఏర్పడిందట. నాగార్జునను రెండు, మూడు సార్లు కలిసినా ఈ విషయం మాత్రం ఆయనతో ఎప్పుడూ చెప్పలేదని.. మనస్సులో అలాగే ఉండిపోయిందని పవిత్ర చెప్పుకు వచ్చింది.
నాగార్జున తర్వాత ప్రకాష్‌రాజ్‌ను చూసినప్పుడు కూడా తనలో క్రష్ ఫీలింగ్ కలిగిందని.. ఆయనతో చాలా సినిమాల్లో యాక్ట్ చేశానని కూడా చెప్పింది. అయితే సెట్స్ లో ఉన్నప్పుడు ప్రకాష్‌రాజ్‌పై ఉన్న రెస్పెక్ట్‌తో తాను ఆయనకు చాలా దూరంగా కూర్చునే దానిని అని చెప్పింది. సరే ఈ క్రష్‌ల సంగతి ఎలా ఉన్నా.. తాజాగా పవిత్రా లోకేష్‌పై ఆరేడు నెలలుగా కొత్త రూమర్ కూడా బయటకు వచ్చింది.
సీనియర్ నటుడు నరేష్ – పవిత్ర కలిసి సహజీవనం చేస్తున్నారన్నదే ఆ టాక్ ? పవిత్రకు ఇప్పటికే పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరి భర్తకు ఆమెకు విడాకులు ఇచ్చిందా ? లేదా ? విబేధాలు వచ్చాయా ? అన్న క్లారిటీ అయితే లేదు. ఇటు నరేష్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇటీవలే నరేష్ మూడో భార్య నరేష్ పేరు చెప్పి భారీగా వసూళ్లకు పాల్పడుతుందన్న ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కింది. అయితే తమ ఫ్యామిలీ ఫంక్షన్లతో పాటు చాలా ఫంక్షన్లకు నరేష్, పవిత్ర కలిసే వస్తున్నారు.