థమన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి టేస్ట్ ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్. పైగా అల వైకుంఠపురములో సినిమా నుంచి థమన్ పట్టిందల్లా బంగారం అవుతోంది. థమన్‌కు తిరుగులేదు. ఆ సినిమా పాటలు దేశాన్నే ఊపేశాయి. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌లో చాలా క్రెడిట్ థమన్‌కూ దక్కుతుంది. ఇక బాలయ్య అఖండలో థమన్ ఇచ్చిన బీజీఎం థియేటర్లను అమలాపురం నుంచి అమెరికా వరకు దద్దరిల్లిపోయేలా చేసింది. దీంతో థమన్ ఇమేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇప్పుడు దేవిశ్రీలు.. మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్లు రేసులో వెనకపడిపోయారు. వరుస సక్సెస్‌లు.. పెరిగిపోయిన క్రేజ్ చూసుకునో ఏమోగాని థమన్ తనకు సంబంధం లేని విషయాల్లో కూడా ఓవర్ అయిపోతున్నాడన్న చర్చలు ఇప్పుడు మీడియా వర్గాల్లో వినిపిస్తున్నాయి.
తాజాగా వచ్చిన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు థమనే బీజీఎం ఇచ్చాడు. పాటల కంటే బీజీఎం చాలా హైలెట్ అయ్యింది. థమన్‌కు మంచి మార్కులు పడ్డాయి. అయితే సినిమాకు నెగిటివ్ టాక్ కంటిన్యూ అవుతోంది. రివ్యూలు అన్ని దాదాపు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. చివరకు బిజినెస్ విషయంలో ఆచితూచి స్పందించే తరణ్ ఆదర్శ్ లాంటి వాళ్లు సైతం సినిమా బాగోలేదనే చెప్పారు. సాహోకు నెగిటివ్ టాక్‌తో బాలీవుడ్‌లో తొలి రోజు రు. 25 కోట్ల నెట్ వస్తే.. రాధేశ్యామ్‌కు మూడు రోజుల్లో కలిపినా కూడా రు. 12 కోట్లు దాటడం గగనం అయిపోయింది.
సరే టాక్ ఎలా ఉన్నా ప్రమోషన్లు అయితే బాగానే నడుస్తున్నాయి. ఎందుకో గాని వచ్చిన ఈ టాక్‌తో సగటు సినీ అభిమాని కూడా సినిమా తప్పకుండా చూసేయాలన్న ఆతృతతో అయితే లేడు. ఇక సగటు సినీ అభిమానుల్లో చాలా మంది త్రిబుల్ ఆర్ చూద్దాములే అన్నట్టుగా రాధేశ్యామ్ విషయంలో నిట్టూర్పుతో ఉన్నారు. ఇక ప్రమోషన్లలో దర్శకుడు రాధాకృష్ణ కుమార్, థమన్ కలిసి పాల్గొన్నారు. సినిమా స్లోగా సాగిందనే మీడియా వాళ్లు వేసిన ప్రశ్నను థమన్ తిప్పికొట్టేశాడు.
సినిమా బాగుందని.. అది అంత పెద్ద కంప్లైంట్ కాదని చెప్పడంలో తప్పు లేదు. కానీ క్రిటిక్స్‌ను, మీడియా వాళ్లను తప్పుపట్టేలా ఓవరాతి ఓవర్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది థమన్ కెరీర్‌కు కూడా ఇబ్బందే. థమన్ అంటే మీడియా వర్గాల్లోనూ సాఫ్ట్ కార్నరే ఉంది. తన పనేదో తాను చేసుకుపోయే వ్యక్తి. అయితే మీడియా వాళ్ల ముందు సినిమా స్లో ఉందన్న ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ సినిమా ఎలా స్పీడ్‌గా తీయాలో మాకు నేర్పించండి అంటూ క్రిటిక్స్‌కే పంచ్ విసిరాడు.
అక్కడితో ఆగకుండా క్రిటిక్స్‌కు ఏమైనా కాలేజ్ ఉందా బ్రో అని మరో పంచ్ వేశాడు. సినిమాకు వ్యతిరేకంగా వచ్చిన ఏ కామెంట్‌ను కూడా థమన్ స్వీకరించేందుకు సిద్ధంగా లేడు. పైగా 40 నిమిషాల ప్రెస్‌మీట్లో థమనే ఏకంగా 30 నిమిషాలు వాయింపుడు కార్యక్రమం చేసేశాడు. పక్కన దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఉన్నా కూడా ఆయన్ను డమ్మీని చేసి తానే డైరెక్టర్‌లా ఫీల్ అవుతూ మీడియా ముందు చకచకా మాట్లాడేశాడు. అయితే మీడియాను, క్రిటిక్స్‌ను వ్యంగ్యంగా మాట్లాడడమే ఇక్కడ థమన్‌ను టార్గెట్ చేయడానికి కారణమైంది.