ఎన్టీఆర్‌ను ఫ్యాన్స్ థియేటర్లలో చూసి మూడున్నర సంవత్సరాలు అవుతోంది. అప్పుడెప్పుడో 2018 అక్టోబర్‌లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమాతో కనిపించాడు. మూడున్నర సంవత్సరాలు త్రిబుల్ ఆర్ కోసమే కేటాయించాడు. రాజమౌళి సినిమా కావడంతో యేడాదిన్నర, రెండేళ్లు ఎలాగూ పడుతుంది. పైగా రామ్‌చరణ్ కూడా ఉన్నాడు.. దీనికి తోడు కరోనా మూడు సార్లు వచ్చి అసలు రిలీజ్‌లే ఆగిపోయాయి. అందుకే మూడున్నర సంవత్సరాలుగా ఎన్టీఆర్ థియేటర్లలో కనిపించకపోవచ్చు.. ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారు.
అయితే తన కెరీర్‌లో ఇంత గ్యాప్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ దీనిని ఎందుకు సద్వినియోగం చేసుకోలేదన్న బాధ ఫ్యాన్స్‌లో ఉంది. వాస్తవానికి త్రిబుల్ ఆర్ షూటింగ్ యేడాది క్రితమే కంప్లీట్ అయ్యింది. అప్పుడే కొరటాల శివ సినిమా స్టార్ట్ చేయడమో లేదా త్రివిక్రమ్ సినిమా పట్టాలు ఎక్కించేసినా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ అయిపోయి ఉండేది. ఈ యేడాదే ఎన్టీఆర్‌ను మరోసారి థియేటర్లలో చూసుకునే అదృష్టం అభిమానులకు ఉండేది.
అసలే తమ అభిమాన హీరో సినిమా వచ్చి మూడున్నరేళ్లు అవుతోంది. ఫ్యాన్స్ ఇన్ని రోజులు సినిమా లేకుండా ఎలా ఆగుతారు. అదే ఈ సినిమాలోనే నటించిన రామ్‌చరణ్ మాత్రం పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నాడు. ఓ వైపు తన తండ్రితో కలిసి ఆచార్య సినిమా పూర్తి చేసేశాడు. ఆచార్య ఏప్రిల్ 29న వస్తోంది. మరోవైపు తన 15వ సినిమా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా రెండు, మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.
ఈ యేడాదే త్రిబుల్ ఆర్‌తో పాటు చరణ్ నటిస్తోన్న మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఎన్టీఆర్ – కొరటాల సినిమా ఇప్పటకీ సెట్స్ మీదకు వెళ్లలేదు. అంటే వచ్చే యేడాది కాని ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సులు లేవు. వచ్చే యేడాది కొరటాల శివ సినిమాతో సరిపెట్టుకుంటే.. మరో సినిమా వస్తందన్న గ్యారెంటీ లేదు. అదే తారక్ ఈ మూడేళ్లలో మంచి కథలు విని.. ఇద్దరు, ముగ్గురు డైరెక్టర్లను చెర్రీలా లాక్ చేసి పెట్టుకుంటే ఈ గ్యాప్ వచ్చేదే కాదు.
ఇప్పటకీ అయినా ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తుండగానే.. వెంటనే లైన్లో మరో డైరెక్టర్‌తో సినిమా సెట్ చేసుకుంటూ ఈ ల్యాగ్ రాదు.. అభిమానులు కూడా ఎన్టీఆర్ సినిమా కోసం ఇంత నీరక్షించాల్సిన ఇబ్బంది ఉండదు. మరి తారక్ అభిమానుల ఆవేదన అర్థం చేసుకుని ఇకపై సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని ఆశిద్దాం. ఇక కొరటాల తర్వాత ఎన్టీఆర్ లైనప్‌లో సానా బుచ్చిబాబు – ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఈ సినిమాలు సెట్స్ మీద ఉండగానే నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టుకుంటే వెళితే మరిన్ని సినిమాలు చూసే భాగ్యం కలుగుతుంది.