సాధారణంగా స్టార్ హీరోయిన్లు వివాహం అంటే ఎందుకో ఆసక్తి చూపరు. కెరీర్ బాగున్నప్పుడు.. ఛాన్సులు వస్తున్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే నాలుగు రాళ్లు కూడా రావు.. కెరీర్‌కు త్వరగానే ఫుల్స్టాప్ పడుతుందన్న బెంగతో ఉంటారు. అందుకే పెళ్లీడు వచ్చేసి 30 ఏళ్లు కాదు.. 35 ఏళ్లు దాటేసి 40 ఏళ్లకు చేరువ అవుతున్నా కూడా ఇంకా ఛాన్సులు వస్తుంటే పెళ్లి అన్న మాటనే వాయిదా వేస్తూ ఉంటారు. ముదురు ముద్దుగుమ్మలు అనుష్క, నయనతార, త్రిష ఇందుకు ఉదాహరణ. వీళ్లు ఇప్పటకీ 35 + దాటేసినా కూడా పెళ్లి అన్న ముక్కే అనడం లేదు.
పెళ్లి అన్న మాట మీడియా నుంచి వస్తే చాలు ఏదో ఒక సాకు చూపి తప్పించేసుకుంటూ ఉంటారు. ఈ లిస్టులోను ఉన్న ముదురు ముద్దుగుమ్మ తాప్సీ పన్ను త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఆమె త్వరలోనే తన ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తెలుగులో తాప్సీ స్టార్ హీరోలతో నటించినా కాని.. ఆమెకు ఎందుకో స్టార్ హీరోయిన్ స్టార్డమ్ అయితే దక్కలేదు.
తెలుగులో ఆనందోబ్రహ్మ లాంటి హిట్ తర్వాత మిషన్ ఇంపాజిబుల్ సినిమా చేస్తోంది. అటు బాలీవుడ్‌లోనూ మంచి అవకాశాలే దక్కించుకుంటోంది. ఇక తాప్సీ నటిస్తోన్న మిషన్ ఇంపాజిబుల్ సినిమాకు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఉన్నది ఉన్నట్టు ఫేస్ మీదే కుండబద్దలు కొట్టేసే తాప్సీకి తెలుగు, సౌత్ భాషల కంటే హిందీలోనే ఎక్కువుగా గుర్తింపు వచ్చింది.
చివరకు ఆమె క్రేజ్ చూసి కంగనా రనౌత్ లాంటి కాంట్రవర్సీ క్వీన్ కూడా ఆమెను టార్గెట్ చేసే వరకు వెళ్లింది. ఇక తాప్సీ చాలా రోజుల నుంచి మథియాస్ అనే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తో డేటింగ్లో ఉంది. ఈ విషయంపై ఆమె గతంలోనే ఓపెన్ అయ్యింది. ప్రేమలో మధురానుభూతులను బాగా ఎంజాయ్ చేస్తున్నానని కూడా తాప్సీ చెప్పింది. ఇక త్వరలోనే అతడితో మూడు ముళ్లు వేయించుకుని బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి పలికేందుకు తాప్సీ సిద్ధమవుతోందట. ఏదేమైనా మొత్తానికి ఓ ముదురు ముద్దుగుమ్మ దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోతోంది.