మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కొణిదెల సింపుల్ సిటీకి కేరాఫ్. ఆమెకు భర్త, కుటుంబమే లోకం.. బయట విషయాలు పెద్దగా పట్టించుకోరు. తన భర్త సినిమాలు రికార్డులు కొట్టినా, తన కొడుకు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ తరం జనరేషన్ సూపర్ స్టార్‌గా ఉన్నా కూడా ఆమె చాలా సింపుల్‌గానే ఉంటారు. పైగా ఆమెది ఎంత మంచి మనస్సో ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా స్వయంగా చిరుయే చెప్పారు. తాను సొంతంగా కష్టపడి సంపాదించుకున్న కోకాపేట భూముల్లో తన సోదరిమణులకు కూడా కొంత వాటా ఇవ్వాలని చెప్పి.. మరి ఇప్పించిన మనస్సు వ్యక్తి సురేఖ అని తన భార్య గొప్పతనం చిరు చెప్పారు.
ఇక సురేఖ బయట ఫంక్షన్లలో పెద్దగా కనిపించరు. ఎప్పుడు అయినా బయట ఇండస్ట్రీలో ఎవరైనా ఫంక్షన్లకు పిలిస్తే భర్తతో కలిసి మాత్రమే వస్తూ ఉంటారు. ఇది కూడా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక సురేఖకు తన భర్త, తన కుటుంబ అంటే ఎంతో ప్రాణం.. వారే లోకంగా ఆమె జీవిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఆమె తన భర్త నటించిన సినిమాల ప్రీమియర్ షోలు చూసేందుకే అందరితోనూ కలిసిరారు. ఇంట్లో హోమ్ థియేటర్లో చూడడమో లేదా బయట హడావిడి లేకుండా వెళ్లి చూసిరావడమోనే జరుగుతూ ఉంటుంది.
అయితే సురేఖ కొన్నేళ్ల క్రితం ఓ హీరో నటించిన సినిమాను భర్త చిరుతో కలిసి వీక్షించారు. అంతే కాకుండా ఆ సినిమా ఆమెకు పిచ్చపిచ్చగా నచ్చేయడంతో ఆ హీరోను ప్రత్యేకంగా మెచ్చుకున్నారట. డైలాగ్ కింగ్ సాయికుమార్ కన్నడలో నటించిన పోలీస్‌స్టోరీ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాను తెలుగులో చూస్తారా ? చూడరా ? అన్న సందేహాల నేపథ్యంలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. అయితే అప్పుడు సాయికుమార్‌కు తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు.
సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చేందుకు ఎవరైనా ఇద్దరు ముగ్గురికి ప్రివ్యూ వేసి వాళ్లతో సినిమా బాగుందని వాయిస్ చెప్పిస్తే అది హెల్ప్ అవుతుందని అనుకున్నారట. అలా రామానాయుడు గారితో పాటు చిరంజీవి, పరుచూరి గోపాలకృష్ణ లాంటి వాళ్లకు ఈ సినిమా వేశారు. అయితే చిరుకు షూటింగ్ ఉండడంతో ఆయనకు మాత్రమే ప్రత్యేకంగా ఓ ప్రివ్యూ వేశారు. ఆ షోకు చిరుతో పాటు సతీమణి సురేఖ కూడా వచ్చారట.
సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేసిన చిరు షో అయిపోయాక కారెక్కుతూ సాయికుమార్‌ను పిలిచి చాలా బాగా చేశావ్ రా.. అలా కాదు ఇంకా చెప్పాలంటే ఇరగదీశావురా అని భుజం తట్టి మెచ్చుకున్నారట. వెంటనే సురేఖమ్మ కూడా సాయికుమార్ దగ్గరకు వెళ్లి చాలా బాగా చేశావ్ అమ్మా… సినిమా చాలా బాగుంది.. డైలాగులు బాగున్నాయని అభినందించారట. ఈ సంఘటనను తాను ఎప్పటకీ మర్చిపోలేనని సాయికుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.