సినిమా కథలు ఎక్కడ పుడతాయో ? ఎక్కడ ఎటు ఎలా తిరిగి ఎటు వెళ్లి ఎవరి దగ్గర వాళతాయో ? తెలియదు. ఒక్కోసారి సూపర్ హిట్ సినిమాలు కూడా స్టార్ హీరోలు చేజేతులా వదిలేసుకుంటారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ సైతం చేతులు మారి అటూ ఇటూ తిరిగి ప్రభాస్ చేతికి చిక్కిందట. రెండున్నర సంవత్సరాల క్రితం షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా సుధీర్ఘంగా షూటింగ్ జరుపుకుని ఎట్టకేలకు ఈ నెల 11న థియేటర్లలోకి వస్తోంది.
ఈ కథ డైరెక్టుగా ప్రభాస్ చేతికి వచ్చిందని.. ఈ సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ అనుకునే ఇప్పటి వరకు అందరూ అనుకున్నారు. అసలు ఈ కథ ఈ దర్శకుడిదే కాదని.. ఈ కథ ముందుగా మరో హీరో దగ్గరకు వెళ్లి రిజెక్ట్ అయ్యాక ప్రభాస్ దగ్గరకు వచ్చిందని ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ కథ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిది అట. ఆయన సొంతంగా రాసుకున్నారు. ఆయన పామిస్ట్రీ అన్న పాయింట్‌ను బేస్ చేసుకుని రాసుకున్న కథను సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ దగ్గరకు తీసుకు వెళ్లారట.
అయితే అప్పుడు ఇది మెయిన్‌గా పామిస్ట్రీ బేస్ చేసుకున్న కథే. ఇందులో లవ్‌స్టోరీ లేదు. ఈ కథ మొత్తం విన్న వెంకీ సెకండాఫ్ మీద పెద్దగా పాజిటివ్ ఒపీనియన్‌తో లేకపోవడంతో ఆయన చేయనని చెప్పేశారట.
ఇక సురేష్‌బాబు ఏ కథను ఓ పట్టాన ఓకే చేయరు. ఆయనకు ఎంతో నమ్మకం కుదరాలి. అలా చంద్రశేఖర్ యేలేటి ఆ కథను అమ్మేశారు. ఆ తర్వాత ఆ కథలోకి పామిస్ట్రీకి సమాంతరంగా లవ్ స్టోరీ కూడా వచ్చి చేరింది. చివరకు ఇది పాన్ ఇండియా సినిమాగా మారింది.
బాహుబలి తర్వాత అనుకున్న ఈ కథ సాహో పూర్తయ్యాక ఇలా పట్టాలు ఎక్కింది. ముందుగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ టీం ఏకంగా రెండేళ్ల పాటు ఈ సినిమా కథ మీద కసరత్తులు చేసింది. మొత్తం వడ్డీలతో కలుపుకుని రు. 250 కోట్ల ఈ సినిమాకు అయ్యిందని అంటున్నారు. మరి ప్రభాస్ జాతకం ఈ సినిమాతో మరింత ఎత్తుకు వెళుతుందా ? లేదా ? అన్నది ఈ నెల 11న తేలిపోనుంది.