సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు రెడీ అవుతున్నాడు. అంతకు ముందే పరశురాం దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అవుతుంది. సర్కారు వారి పాట మే 12న రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాకు జాయిన్ అవుతాడు. ఈ సినిమా ఏడెనిమిది నెలల పాటు షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తోంది. అంటే దసరాకు మహేష్ – త్రివిక్రమ్ సినిమా నుంచి కూడా ఫ్రీ అయిపోతాడని అంటున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమాకు తన కాల్షీట్లు ఇస్తాడు.
రాజమౌళి సినిమా ఎన్నేళ్ల పాటు షూటింగ్‌లో ఉంటుందో తెలియదు. ఇక సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇది కీలకమైన టెక్నికల్ కాస్ట్.. స్టార్ కాస్ట్ ఈ వరకే ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో ఓ కీలక నటుడు కావాల్సి ఉందట. ఈ నటుడి పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో నదియా, టబు, ఉపేంద్ర, స్నేహ పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే.
ఇక గతంలో మోహన్‌లాల్ – సముద్రఖని – విజయ్ సేతుపతిలా కాకుండా ఇది హీరోతో సమానమైన పాత్ర అంటున్నారు. ఈ పాత్రకు ఇతర భాషల హీరోలనే పెట్టాలని కూడా త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యారట. అయితే ఆ పాత్రకు ఎవరు ఉంటారు ? అన్నదానిపై తర్జన భర్జనలు నడుస్తున్నాయి. మళయాళ, తమిళ యంగ్ హీరోల వైపు కాన్‌సంట్రేషన్ చేస్తున్నారట. ఇందుకు ప్రధాన కారణం.. అక్కడ మార్కెట్ మీద కూడా దృష్టి పెట్టడమే అంటున్నారు.
త్రివిక్రమ్ – మహేష్ ఇద్దరూ ఓ అంగీకారానికి వచ్చి కాని ఈ పాత్రకు ఎవరిని సెట్ చేయాలన్నది డిసైడ్ చేయరని కూడా టాక్ ఉంది. ఏదేమైనా సర్కారు వారి పాట ఫినిషింగ్ స్టేజ్‌లో ఉంది. అది పూర్తయ్యే లోగా ఈ హీరో పాత్రలోకి ఎవరు వస్తారు ? అన్న దానిపై క్లారిటీ రావచ్చు. ఇక గతంలో మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. అతడు ఓ మోస్తరుగా ఆడింది. మహేష్ కెరీర్‌లో మంచి సినిమాగా రికార్డులకు ఎక్కింది.
ఇక వీరి కాంబోలో చివరిసారిగా 2010లో ఖలేజా సినిమా వచ్చింది. ఖలేజా కూడా ప్లాపే అయితే మహేష్ కెరీర్‌లోనే మంచి సినిమాగా ప్రశంసలు అందుకుంది. మళ్లీ ఇప్పుడు 12 ఏళ్లకు వీరి కాంబోలో సినిమా వస్తోంది. మరి ఈ సినిమాతో అయినా త్రివిక్రమ్ .. మహేష్‌కు తిరుగులేని హిట్ ఇస్తాడేమో ? చూడాలి.