Moviesస్టార్ డైరెక్ట‌ర్ బాల దంప‌తుల విడాకులు.. చిచ్చు పెట్టింది ఎవ‌రు..!

స్టార్ డైరెక్ట‌ర్ బాల దంప‌తుల విడాకులు.. చిచ్చు పెట్టింది ఎవ‌రు..!

ఇటీవ‌ల కాలంలో సినిమా సెల‌బ్రిటీలు విడాకుల వ్య‌వ‌హారాలు చాలా కామ‌న్ అయిపోయాయి. టాలీవుడ్ లేదు కోలీవుడ్‌, బాలీవుడ్ ఇలా ఎక్క‌డ చూసినా కూడా విడాకులు చాలా మామూలు అయిపోయాయి. కొద్ది నెల‌ల క్రితం టాలీవుడ్ స్టార్ హీరో నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకులు పెద్ద క‌ల‌క‌లం రేపాయి. అది మ‌ర్చిపోక ముందే బాలీవుడ్‌లో ప‌లువురు సెల‌బ్రిటీలు విడాకులు తీసుకున్నారు. అమీర్ ఖాన్ త‌న భార్య కిర‌ణ్‌రావుకు విడాకులు ఇచ్చేశాడు.

ఇక కోలీవుడ్‌లో ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య విడాకులు తీసుకుని పెద్ద బాంబు పేల్చారు. కోలీవుడ్ మాత్ర‌మే కాకుండా.. టోట‌ల్ సౌత్ టు నార్త్ సినిమా వాళ్లంతా ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య విడాకుల‌తో ఉలిక్కిప‌డ్డారు. ఇప్పుడు కోలీవుడ్‌లో మ‌రో విడాకులు జ‌రిగాయి. స్టార్ డైరెక్టర్ బాల దంపతులు విడాకులు తీసుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. బాల అత‌డి భార్య ముత్తు మ‌ల‌ర్‌కు ఈ నెల 5న కోర్టు విడాకులు మంజూరు చేసింద‌ని తెలుస్తోంది.

ఇక గ‌త నాలుగేళ్ల నుంచే ఇద్ద‌రూ విడివిడిగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇద్ద‌రి అంగీకారం మేర‌కే కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ దంప‌తుల‌కు ప్రార్ధ‌న అనే పాప ఉంది. వీరు విడాకులు తీసుకోవ‌డంతో పాప బాధ్య‌త ఎవ‌రు తీసుకుంటారు అన్న‌ది మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. బాల వైవాహిక జీవితానికి, స‌మాజ బాధ్య‌త‌ల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఇస్తారు ? అలాంటిది ఆయ‌న భార్య‌తో విడాకులు తీసుకోవ‌డం కోలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కోలీవుడ్‌లో వైవిధ్య‌మైన సినిమాలు అంటేనే మ‌న‌కు ముందుగా బాల గుర్తుకు వ‌స్తాడు. అలాంటి ఆయ‌న 17 సంవ‌త్స‌రాలు కాపురం చేశాక భార్య‌తో విడిపోవాల్సిన అవ‌స‌రం ఏం వ‌చ్చింది ? అన్న‌ది కూడా చ‌ర్చ‌గా మారింది. బాల త‌న సినిమాల్లో ప‌నిచేసిన ఓ హీరోయిన్‌తో స‌న్నిహితంగా ఉండ‌డంతో భార్య‌కు న‌చ్చలేద‌న్న గుస‌గుస‌లు అప్పుడే వినిపించాయి. కార‌ణం ఏదైనా గాని.. ఐదేళ్ల నుంచే ఈ విష‌యంలో భార్య‌తో గొడ‌వ‌లు స్టార్ట్ అయ్యాయి.

ఆ త‌ర్వాత ఇదే పెద్ద గొడ‌వ‌కు దారితీయ‌డం.. అప్ప‌టి నుంచి ఎవ‌రి దారుల్లో వారు ఉండ‌డం జ‌రుగుతూ వ‌స్తోంది. చివ‌ర‌కు విడాకుల వ‌ర‌కు వ‌చ్చేసింది. ఏదేమైనా ఇండ‌స్ట్రీలో మ‌రో సెల‌బ్రిటీ దంప‌తులు విడిపోయారు. ఈ ప‌రంప‌ర‌కు ఇప్ప‌ట్లో బ్రేకులు ప‌డేలా లేవు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news