ఏ సినిమాలో అయినా.. ఎంత యాక్షన్ సినిమా అయినా అంతర్లీనంగా ఎంతోకొంత ప్రేమ కథ ఉంటుంది. అది యాక్షన్ సినిమా అయినా.. ఫ్యాక్షన్ సినిమా అయినా ప్రేమకథ ఉంటుంది. యాక్షన్ సినిమాలు, రివేంజ్ సినిమాలకు కోట్లలో బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు. హాలీవుడ్ జేమ్స్‌బాండ్ సినిమాలు… బాలీవుడ్ యాక్షన్ సినిమాలు.. చైనా జాకీచాన్ సినిమాలు ఇలా కోట్లు ఖర్చు పెట్టి తీస్తూ ఉంటారు. అయితే ఓ పూర్తి స్థాయి ప్రేమకథ మీద ఏకంగా ఒకటి కాదు రెండు కాదు రు. 300 కోట్లు ఖర్చు పెట్టడం అంటే గొప్ప విషయం.
ఇప్పుడు ఇండియన్ సినిమా చర్చ అంతా ప్రభాస్ లవ్‌స్టోరీ రాధేశ్యామ్ గురించే నడుస్తోంది. సాధారణంగా ప్రేమకథలకు అంత బడ్జెట్‌లు ఉండవు. ఇంకా చెప్పాలంటే అంత భారీతనం ప్రేమకథల మీద పెట్టేంత సీన్ ఉండదు. భారీ యాక్షన్ సినిమాల్లో హీరో ఎలివేషన్లకు, పెద్ద పెద్ద కాస్టింగ్‌కే కోట్లలో ఖర్చవుతూ ఉంటుంది. బాహుబలి లాంటి సినిమాకు ఖర్చంతా ఆర్ట్ డిపార్ట్‌మెంట్, గ్రాఫిక్స్, టెక్నీషియన్లకే ఎక్కువ అవుతుంది.
ఇక చిరంజీవి సైరా, బాలయ్య శాతకర్ణికి అంతే స్థాయిలో ఖర్చయ్యింది. అయితే ఇప్పుడు రాధే శ్యామ్ లాంటి ప్రేమకథకు ఏకంగా రు. 300 కోట్లు పెట్టారంటే ఏ ధైర్యంతో అన్నది ఇండియన్ సినిమా వర్గాలకు కూడా అంతు పట్టడం లేదు. బహుశా ప్రపంచ సినిమా చరిత్రలో ఇంత భారీ బడ్జెట్‌తో వస్తోన్న ప్రేమకథ ఇదే అయ్యేలా ఉంది. ఈ సినిమాకు పెట్టిన రు. 300 కోట్లలో రు. 100 కోట్లు కేవలం ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కే ఖర్చు పెట్టారని అంటున్నారు.
కథతో పాటు ప్రభాస్ ఇమేజ్‌ను నమ్ముకునే నిర్మాతలు ఇంత ధైర్యం చేశారని అంటున్నారు. పైగా దర్శకుడు కూడా అంత గొప్ప అనుభవం ఉన్న దర్శకుడు కాదు. ఒక్క సినిమాను మాత్రమే డైరెక్ట్ చేసిన సుజిత్‌తో ప్రభాస్ సాహో లాంటి పెద్ద సినిమా చేశాడు. ఇక ఇప్పుడు జిల్ సినిమా మాత్రమే చేసిన రాధాకృష్ణ కుమార్‌తో ఇంత ఖర్చుతో తీసిన రాధేశ్యామ్ సినిమా చేశాడు.
యూరప్‌లోని ఇటలీ నేపథ్యంగా 1960లో నడిచిన ఓ యదార్థ ప్రేమకథ ఇది అని అంటున్నారు. అందుకే ఇటలీ వెళ్లి మరీ ఆ కాలం ఫీల్ తీసుకువచ్చేందుకు ఏకంగా 100కు పైగా సెట్లు వేశారట. ఇన్ని సెట్లు వేసిన సినిమాగా కూడా రాధేశ్యామ్ రికార్డులకు ఎక్కింది. పైగా 42 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రభాస్ నటిస్తోన్న ప్రేమకథ కావడంతో ప్రభాస్‌ను చాలా యంగ్‌గా చూపించేందుకు కూడా బాగా కష్టపడ్డారనే అంటున్నారు.
నాలుగు సంవత్సరాల పాటు సుధీర్ఘంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు వడ్డీల భారమే రు. 70 కోట్లు అయ్యిందని అంటున్నారు. ముందు మరీ భారీ అంచనాలు లేకపోయినా ప్రి రిలీజ్‌కు ముందు మంచి హైపే వచ్చింది. ఈ సినిమాకు భారీ లాభాలు వస్తే పెద్ద సంచలనమే అవుతుంది. ప్రభాస్‌కు సాటిరాగల హీరోలు ఎవ్వరూ ఉండరు. కనీసం బ్రేక్ ఈవెన్ వచ్చినా రాధేశ్యామ్ గ్రేటే అనుకోవాలి.