మూడున్నరేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వస్తోన్న RRR సినిమా ఎట్టకేలకు నిన్న థియేటర్లలోకి దిగింది. సరే కొందరు కొన్ని వంకలు పెడుతున్నారు.. మరి కొందరు సూపర్ అంటున్నారు. ఓవరాల్‌గా ఓ 10 శాతం మంది సినిమాకు పేర్లు పెడుతున్నా 90 శాతం మందికి అయితే నచ్చేసిందిగా.. సినిమా అయితే సూపర్ హిట్టు.. తిరుగులేదు. ఇక ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రు. 223 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టేసింది. ఇది అరాచకం కాదు అంతకు మించిన భీకర భీభత్సం. తెలుగు సినిమా చరిత్రనే కాదు.. భారతీయ సినిమా చరిత్రను తిరగరాస్తూ ఈ సినిమాకు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి.
ఇక సినిమాను భూతద్దంలో పెట్టి చూసే వాళ్లంతా ఇప్పుడు రామ్‌చరణ్ పాత్రే హైలెట్… ఎన్టీఆర్ పాత్ర కంటే ఈ పాత్రకే రాజమౌళి ప్రయార్టీ ఇచ్చాడని అంటున్నారు. సరే వీళ్ల చర్చనే ప్రధానంగా తీసుకుందాం. నిజానికి సినిమాలో కథానుసారంగా ఇద్దరవి బలమైన పాత్రలే. అయితే భీం పాత్ర పోషించిన ఎన్టీఆర్ తన గోండు జాతి పిల్లను బ్రిటీష్ దొరసాని తీసుకువెళ్లిందని.. ఆ పిల్లను తీసుకువచ్చేందుకే ఢిల్లీ వెళతాడు. అంతకు మించిన లక్ష్యం ఎన్టీఆర్‌ది కాకపోవచ్చు.
ఇక రామరాజు పాత్ర చేసిన చరణ్‌కు బలమైన లక్ష్యం ఉంది. తన తండ్రి, తల్లి బ్రిటీషర్ల చేతిలో స్వాతంత్రోద్యమం కోసం చేసిన పోరాటంలో అసువులు బాస్తారు. తండ్రికి బ్రిటీషర్లను దేశం నుంచి పారద్రోలతాను అని ఇచ్చిన మాట కోసం అదే బ్రిటీష్ సైన్యంలో చేరి వారికి నమ్మకంగా ఉంటూనే అదనుచూసి వారిని దెబ్బకొట్టేందుకు మాటువేసి ఉంటాడు. చివరకు తన లక్ష్యం నెరవేర్చుకునే క్రమంలో ఎన్టీఆర్ సాయం తీసుకుని సక్సెస్ అవుతాడు.
పాత్ర పరంగా చూస్తే తక్కెడ త్రాసు కాస్త చరణ్ వైపు మొగ్గు చూపినట్టుగా ఉంటుంది. ఫస్టాఫ్‌లో, ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఎన్టీఆర్ డామినేషన్ ఉంటుంది. సెకండాఫ్‌లో, క్లైమాక్స్‌లో చరణ్ పాత్రకు ప్రయార్టీ ఉంటుంది. సహజంగా ఏ ప్రేక్షకుడు అయినా కూడా క్లైమాక్స్‌ను దృష్టిలో పెట్టుకుని బయటకు వస్తాడు.. క్లైమాక్స్‌లో కాస్త చరణ్‌కు ప్రయార్టీ ఉన్నట్టు ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తితో ఉన్నట్టు ఉంది. అయితే నటనా పరంగా ఎన్టీఆర్ విరోచితంగా చేసి ఆ బ్యాలెన్స్ సరిచేశాడు.
సరే ఈ లెక్కలు, కొలతలు ఎలా ఉన్నా ఎక్కడ ఎన్టీఆర్‌ను నిజంగా మెచ్చుకోవాలి. చరణ్ కంటే ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. పైగా ఈ సినిమాకు ముందు ఐదు వరుస హిట్లు. కాస్త ఒక ఆవగింజంత తన పాత్ర తగ్గినట్టుగా ఉన్నా నటనతో కొట్టకు వచ్చేశాడు. ఈగోలకు పోలేదు.. రాజమౌళి చెప్పినట్టే చేశాడు. అసలు గతంలో ఒక చాణక్య చందగుప్త, ఒక కురుక్షేత్రం లాంటి సినిమాలు చూసినప్పుడు మనకు ఆ రేంజ్‌లో మల్టీస్టారర్లు సాధ్యమేనా ? అవి మర్చిపోవడమేనా ? అన్న సందేహాలు ఇన్నేళ్లుగా ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఇవి ఈ ఇద్దరు హీరోలు పటాపంచలు చేసేశారు. వాస్తవంగా చూస్తే ఈ సినిమాలో నటన ఎన్టీఆర్‌కు కొత్త కాదు.. ఇలాంటి పాత్రలు ఆది, సింహాద్రి, యమందొంగ, బాల రామాయణంలోనే చేసేశాడు. కెరీర్ పరంగా మరీ ఇద్ది అంత ప్లస్ అయిపోయే సినిమా కాదు. పైగా మూడేళ్ల టైం కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. ఇక బయట కూడా రామ్‌చరణ్‌తో ఎన్టీఆర్‌కు ఉన్న బాండింగ్, ఫ్రెండ్‌షిఫ్ కూడా ఈ సినిమాలో వీరిద్దరి స్నేహం, పాత్రలు పండడానికి మాంచి హెల్ప్ అయ్యింది. ఏదేమైనా ఎన్టీఆర్ ఈ పాత్ర ఒప్పుకున్నందుకు అతడి వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రాన నిలబెట్టిందనే చెప్పాలి.