జబర్దస్త్ హాట్ బ్యూటీ యాంకర్ రష్మి..తనదైన స్టైల్ లో హోస్ట్ చేస్తూ..బుల్లితెర పై ఓ ప్రత్యేకమైన స్ధానం సంపాదించుకుంది. రష్మీ కి ఉన్న క్రేజ్..ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమ్మడు కి హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి రష్మిని ఓ సీనియర్ నిర్మాత ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టేసి కొడతా అని మాట్లాడటం వివాదస్పదంగా మారింది. పూర్తి వివరాల్లోకెళ్లితే..
యాంకర్ రష్మి గుంటూరు టాకిస్ అనే సినిమా చేసింది గుర్తుందా..అందులో యమ హాట్ గా నటించి మెప్పించింది. ఆ తరువాత అరా కొరా సినిమాలు చేసింది కానీ అవేవీ ఈమెకు హిట్‌ను అందించలేకపోయాయి. అయితే ప్రస్తుతం ఈమె కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం అయింది. సినిమాల్లో చేయడం లేదు. కానీ ఈమె గురించిన ఓ వార్త సంచలనం సృష్టిస్తోంది. అయితే రష్మి తెర పై ఒకలా తెర వెనుక మరోలా ఉంటుందట. దాని గురించి సీనియర్ నిర్మాత బాలాజీ నాగ లింగం. మాట్లాడుతూ రష్మి పై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఒక్కసారిగా రష్మీ అభిమానులు షాక్ కు గురయ్యారు.
ఆయన మాట్లాడుతూ..” యస్..నేను రష్మీని ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టేసి కొడతా అని తిట్టిన మాట నిజమే. అలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే..నేను ఎదుటి వ్యక్తిని చాలా గౌరవంగానే సంబోధిస్తా. అది నా మర్యాదా. అది కాపుడుకోలేకపోతే ..ఇలానే ఉంటాది. సాధారణంగా నేను ఎదుటి వ్యక్తిని తిట్టను. కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటాను.కానీ రష్మీని తిట్టా..ఎందుకంటే ఆమె ప్రవర్తన అలా ఉంది. మాతో రాణిగారి బంగ్లా అనే సినిమా చేయడానికి ఒప్పుకున్న రష్మి రెమ్యూనరేషన్ విష్యంలో పేచి పెట్టింది.
మేం ఇంతనే ఇస్తాం అని ముందే చెప్పాం ఆమెకు..ఆ తరువాతనే తను నటించడానికి ఓకే చెప్పింది. అంతా ఓకే అనుకున్న తర్వాత షూటింగ్ కంప్లీట్ చేసింది. ఓ సాంగ్, డబ్బింగ్ మాత్రమే మిగిలి ఉంది. అప్పుడు డబ్బు విషయంలో రష్మీ అసలు రంగు బయట పెట్టింది. మమ్మల్ని ఆఖరి నిమిషంలో ఇబ్బంది పెట్టాలని అనుకుని హీరోని మార్చేయమని గోల చేసింది. మధ్యలోకి నాగ బాబు, మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డిగారు పేర్లు తీసుకొచ్చి బెదిరించింది. మీడియాకి ఎక్కిస్తా, అది చేస్తే, ఇది చేస్తా అని బెదిరించే ప్రయత్నం చేసింది. రష్మీ నాతో మాట్లాడిన మాటలు రికార్డింగ్ కూడా నాదగ్గర ఉంది. కానీ మేము లొంగలేదు..ఫైనల్ గా షూటింగ్ కంప్లీట్ చేయించుకున్న..ఆ క్రమంలోనే ఆమెను తిట్టాల్సి వచ్చింది”అంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.