విశ్వవిఖ్యాత సార్వభౌమ నటరత్న ఎన్టీ రామారావు సినీ పరిశ్రమకు వచ్చిన తొలిరోజుల్లో హీరో పాత్రలే కాకుండా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ నెగిటివ్ పాత్రలు కూడా చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చిన ఎన్టీఆర్ ఓ వైపు హీరో పాత్రలు వస్తున్నా కూడా మరోవైపు నెగిటివ్ పాత్రలు వేసి పెద్ద సాహసమే చేశారు. అయితే నటుడిగా నిలదొక్కుకుంటోన్న టైంలో వైవిధ్యమైన పాత్రలు చేస్తేనే మంచి పేరు వస్తుందని ఎన్టీఆర్ బలంగా విశ్వసించేవారు.
అందుకే హీరో పాత్రలు మాత్రమే వేయాలని మడికట్టుకుని కూర్చొనేందుకు ఆయన ఇష్టపడేవారు కాదు. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి ఉంటే పాత్రల్లో, నటుడిగా వైవిధ్యాన్ని కోల్పోతామని ఆయన బలంగా నమ్మేవారు. ఎన్టీఆర్ తొలి సినిమా మనదేశంలో ఇన్ స్పెక్టర్ పాత్రలో నటించారు. ఈ పాత్రలో ఆయన బ్రిటీష్ అధికారులు చెప్పినట్టు చేసే స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. స్వాతంత్య్రోదమ్య కాలంలో పోరాటం చేస్తోన్న కాంగ్రెస్ వారిని, వారికి సపోర్ట్ చేస్తోన్న వారిని లాఠీ పెట్టి కొట్టే పాత్రలో ఎన్టీఆర్ నటించారు.
అలాగే ఆ సినిమాలో ఆయన పాత్ర ప్రజల నుంచి దౌర్జన్యంగా పన్నులు వసూలు చేయడంతో పాటు బక్కచిక్కిన గుర్రాన్ని కాళ్లతో తన్నడం వరకు ఇలా చాలానే సీన్లు ఉన్నాయి. ఇక పరివర్తన, తోడుదొంగలు సినిమాల్లో కూడా ఎన్టీఆర్ హీరో అయినా ఆ పాత్రలు కూడా నెగిటివ్ టచ్‌లో ఉన్నాయి. ఇక రఘురామయ్య హీరోగా నటించిన మాయారంభ సినిమాలో నలకూబరుడిగా ఎన్టీఆర్ విలన్‌గా నటించారు. ఇక రాజు పేద సినిమాలో పూర్తి డీ గ్లామరైజ్డ్ పాత్రలో కనిపించారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయ్యింది.
అసలు ఈ పాత్రలో నటించేందుకు ఏ నటుడు కూడా ఇష్టపడడు. ఫేస్‌కు నల్లటి రంగుతో పాటు చింపిరి జుట్టు, చిరిగిపోయిన దుస్తుల్లో ఎన్టీఆర్ అచ్చుగుద్దినట్టు నటించాడు. ఇక గుడిగంటలు సినిమాలో ఎన్టీఆర్ హీరోగానే నటించినా అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి. ఇలా కెరీర్ ఆరంభంలో ఎన్నో నెగిటివ్ పాత్రలు పోషించినా కూడా ఆ తర్వాత ఆయన మల్లీశ్వరి – పాతాలభైరవి సినిమాల్లో హీరోగా నటించి నిలదొక్కేశారు.
ఆ తర్వాత జానపద, పౌరాణిక చిత్రాల్లో తనకు తనేశాటి అనిపించుకున్నారు. రక్తసంబంధాలు , చిరంజీవులు, రాము లాంటి సినిమాల్లో నటించి తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఇక పౌరాణిక పాత్రల్లో ధుర్యోధనుడు, రావణుడు ఇలా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో జీవించి ఎప్పటకి తెలుగు ప్రజల మదిలో అజరారామంగా నిలిచిపోయారు.