Moviesఏఎన్నార్‌ను పిచ్చిగా ప్రేమించిన సావిత్రి ఆ కార‌ణంతోనే పెళ్లి చేసుకోలేదా..!

ఏఎన్నార్‌ను పిచ్చిగా ప్రేమించిన సావిత్రి ఆ కార‌ణంతోనే పెళ్లి చేసుకోలేదా..!

టాలీవుడ్ లో లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు – సావిత్రి కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మహానటి సావిత్రి స్వస్థలం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని చిర్రావూరు. ఇటు అక్కినేని నాగేశ్వరరావు స్వస్థలం కృష్ణా జిల్లాలోని నందివాడ మండలం రామాపురం. వీరిద్దరూ ఒకే టైంలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగి ఇండస్ట్రీని శాసించారు. సావిత్రి ముందు తెలుగులో హిట్ సినిమాలు చేసిన ఆ తర్వాత ఆమెకు తమిళంలో కూడా మంచి డిమాండ్ ఉండేది. తమిళంలోనూ అప్పటి తరం స్టార్ హీరోలందరితో కలిసి నటించి సూపర్ హిట్ కొట్టింది. 1950 – 1980 వ దశకం మధ్యలో సావిత్రి అంటే ఒక సెన్సేషన్.

తెలుగుతో పాటు తమిళంలో అప్పటి తరం స్టార్ హీరోలందరితో కలిసి ఆమె పౌరాణికం – జానపదం – సాంఘికం ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మహానటిగా కీర్తి గడించింది. ఇక నాగేశ్వరరావు అంటే సావిత్రికి ఎంతో ఇష్టం. సావిత్రి చిన్న పిల్లగా ఉన్నప్పుడే విజయవాడలో ఏఎన్ఆర్ ను చూసేందుకు వచ్చిందట. అయితే అప్పుడు జనాలు ఆమెను ప‌క్క‌కు తోసేయడంతో పక్కనే ఉన్న చిన్న కాలువలో పడి పోయాను అని కూడా ఓ సందర్భంలో సావిత్రి చెప్పుకు వ‌చ్చారు.

ఆ తర్వాత హీరోయిన్ అయ్యాక నాగేశ్వరరావును సావిత్రి పిచ్చిపిచ్చిగా నమ్మేసింది. చివరకు నాగేశ్వరరావు కోసం ఆమె ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంటానని చెప్పేవారట. నాగేశ్వరరావు కోసం ఒక సారి ఏకంగా రెండు సంవత్సరాల పాటు తన డేట్లు ఇచ్చి ఆయనపై తనకున్న అపారమైన ప్రేమను సావిత్రి చాటుకున్నారు. ఇంకా చెప్పాలంటే నాగేశ్వర రావుతో వరుసగా సినిమాలు చేసేందుకు ఎన్టీఆర్ సినిమాలను సైతం ఆమె వ‌దులుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఏఎన్నార్‌ను సావిత్రి మనసులో ఆరాధించే చేసేవారట. ఏ ఎన్ ఆర్ ను పెళ్లి చేసుకోవాలని సావిత్రికి బలంగా కోరిక ఉండేదట.

అయితే ఆమె అనుకోకుండా జెమినీ గణేషన్ మాయ‌లో పడడం.. అతడు చెప్పిన మాటలు పూర్తిగా న‌మ్మేయడంతో అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న జెమినీని తప్పనిసరి పరిస్థితుల్లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత జెమిని గణేషన్ కంటే సావిత్రికి క్రేజ్ ఎక్కువగా ఉండడంతో.. అతడి అహంభావానికి సావిత్రి తన కెరీర్‌ను బలి చేసుకుంది. ఎన్నో సందర్భాల్లో సావిత్రిని ఆర్థిక విషయాల్లోనూ… వ్యక్తిగత జీవితంలోనూ ఏఎన్నార్ హెచ్చరించడంతో పాటు చాలా జాగ్రత్తలు చెప్పేవారట. అయితే జెమిని వలలో పడిన ఆమె ఏఎన్నార్ చెప్పిన విషయాలను పెడచెవిన పెట్టడంతో చివరకు ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news