సినీ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా వాళల్లో కొందరు మాత్రమే మనసుకు నచ్చే పాత్రలు చేస్తుంటారు. ఇంకొందరు నచ్చకపోయినా అలాంటి పాత్రలు చేసి డబ్బు కోసం ఇష్టం లేని పనులు చేస్తుంటారు. దీని పూర్తి వ్యతిరేకం హీరోయిన్ సాయిపల్లవి. మొండితనానికి మరో మారు పేరే సాయి పల్లవి. చూడటానికి ఎంత చక్కగా ఉంటుందీ..దానికి తగ్గటే డ్యాన్స్ కూడా చేస్తూ..ఎప్పుడు అందరిని నవ్వుతూ పలకరించే పిలుపు..నచ్చినిది నచ్చిన్నట్లు చేసే ఈ అమ్మడు అంటే ఇండస్ట్రీలో చాలా మందికి ఇష్టం. కందరి హీరోయిన్లకు అయితే అసూయ.
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చినా ఫిదా మూవీతో తెలుగు తెరకు పరిచయమై తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించి చెరగని ముద్ర వేసుకుంది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న బ్యూటీ సాయి పల్లవి.. కేవలం నటన, అభినయంతోనే సాయి పల్లవి యువతకు బాగా చేరువైంది. ఎక్స్ పోజింగ్ అంటే ఆమడ దూరం లో ఉండే ఈ అమ్మడు సినిమాలో తన పాత్ర విషయంలో యమ స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఎదుట ఉన్న వాడు ఎవ్వరైనా సరే.. అది మెగాస్టార్ నా..పవర్ స్టార్ నా అని చూడదు. పాత్ర నచ్చకపోతే నో చెప్పేస్తుంది. ఇలాంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో ఉండటం చాలా అరుదు. అందుకే ఈమెకు స్టార్ హీరోల రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అయితే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సాయి పల్లవి చేసింది కొన్ని సినిమాలే..కానీ చేసిన ప్రతి మూవీలో తన పాత్ర గుర్తుండిపోయేలా నటించింది. ఇక అమ్మడు రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ చూస్తే చేసిన సినిమాల కన్నా కూడా ఎక్కువే ఉంది. ఆ లిస్ట్ స్టార్ హీరోలు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ లిస్ట్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు.
యస్.. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా లో ముందుగా సాయి పల్లవి హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు ఉండటంతో సాయి పల్లవి రిజెక్ట్ చేసింది. అంతేకాదు..తను రొమాంటిక్ సీన్ లల్లో నటించను అని డైరెక్టర్లకు ముందే చెపుతుందట.కోట్లి ఇచ్చినా సరే నాకు నచ్చని పని చేయను అంటూ..ముఖం మీదే చెప్పుతుందట ఈ మలర్ బ్యూటీ.