బాహుబలి ది కంక్లూజన్ సినిమా ఏకంగా రు. 2 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రకే సరికొత్త భాష్యం నేర్పింది. భారతదేశ సినిమా వాళ్లే కాదు.. ప్రపంచ సినిమా కూడా మన దేశం ఇంకా చెప్పాలంటే మన తెలుగు వైపు చూసేలా చేసిన ఘనత దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ త్రిబుల్ పై ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో చూస్తూనే ఉన్నాం.
ఈ సినిమాకు ఏపీ లేదు తెలంగాణ లేదు.. తమిళనాడు, కర్నాకట.. అటు నార్త్.. ఓవర్సీస్ ఎక్కడ చూసినా అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అసలు ఈ ప్రి రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే మైండ్ పోయేలా ఉంది. ఒక్క నైజాం ఏరియాలోనే రు. 70 కోట్లకు ఈ సినిమా రైట్స్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు. సీడెడ్ నాలుగు జిల్లాలకు కలిపి రు. 37 కోట్లకు అమ్మారు.
అలాగే ఉత్తరాంధ్ర ఏరియాలో రు. 22 కోట్లకు అమ్మారు. ఓవరాల్‌గా ఏపీ, తెలంగాణలో రు. 191 కోట్లకు సేల్ అయ్యాయి. అంటే ఏపీ, తెలంగాణ బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే రు. 192 కోట్ల షేర్ రావాల్సి ఉంది. అటు నార్త్‌లో రు. 92 కోట్లకు రైట్స్ అమ్ముడు పోయాయి. ఓవర్సీస్‌లో రు. 75 కోట్లకు అమ్మారు. ప్రపంచ వ్యాప్తంగా రు. 451 కోట్లకు ఈ సినిమా రైట్స్ సేల్ అయ్యాయి. అంటే అంత మొత్తంలో షేర్ రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు అవుతుంది. ఏరియాల వారీగా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయి.
Nizam : 70 కోట్లు
Ceded : 37 కోట్లు
UA: 22 కోట్లు
East: 14 కోట్లు
West: 12 కోట్లు
Guntur: 15 కోట్లు
Krishna: 13 కోట్లు
Nellore: 8 కోట్లు
—————————
AP-TG Total:- 191 కోట్లు
—————————
KA: 41 కోట్లు
Tamilnadu: 35 కోట్లు
Kerala: 9 కోట్లు
Hindi: 92 కోట్లు
ROI: 8 కోట్లు
OS – 75 కోట్లు
———————————————————-
Total WW: 451 కోట్లు (Break Even- 453 కోట్లు + )
———————————————————-