బాహుబలి సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి ఎంత సెన్షేషన్ క్రియేట్ చేశాడో చూశాం. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలతో రచ్చ లేపాడు మన జక్కన్న. బాహుబలి 1 అప్పట్లో సల్మాన్‌ఖాన్ బజరంగీ భాయ్‌జాన్ సినిమాతో పోటీ ఏకంగా రు.650 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక బాహుబలి ది కంక్లూజన్ సినిమా అయితే అరాచకమే లేపేని ఇండియన్ సినిమా చరిత్ర రికార్డులు కూకటివేళ్లతో పెకలించివేసింది. ఏకంగా రు. 2 వేల కోట్ల పై చిలుకు వసూళ్లు రాబట్టింది.
ఇప్పుడు బాహుబలి 2 తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన RRR సినిమా వస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఏది గొప్ప సినిమా అవుతుంది ? ఏది పెద్ద హిట్ అవుతుంది ? RRR బాహుబలి 2 ను మించిన బ్లాక్‌బస్టర్ అవుతుందా ? లేదా ఈ సినిమా కంటే బాహుబలి 2యే మరోసారి తానే కింగ్‌ను అని ఫ్రూవ్ చేసుకుంటుందా ? అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
అసలు సోషల్ మీడియాలో, ట్రేడ్ వర్గాల్లో,, బయట నడుస్తోన్న ట్రెండ్ ఎలా ? ఉందన్నది చూద్దాం. బాహుబలి అనేది అన్ని అంశాలు మిక్స్ చేసి ఉన్న ఫిక్షనల్ యాక్షన్ డ్రామా. మనం పూర్వకాలంలో చూసిన రాజులు, రాజ్యాలు, యుద్ధాలను ఈ తరం జనరేషన్‌కు కనెక్ట్ చేస్తూ అద్భుతంగా చూపించారు. ఇక ఎమోషనల్స్ మాత్రమే కాకుండా.. భారీ సెట్టింగులు, ఫైట్లు, ఒళ్లు గగుర్పొడిచే పోరాట సన్నివేశాలు.. డ్యూయెట్లతో చాలా గ్లామర్‌తో పాటు పక్కా కమర్షియల్‌గా సినిమాను చెక్కాడు.
మహాబలశాలి అయిన విలన్‌గా భళ్లాలదేవుడు రానా ప్రభాస్‌తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా నటించాడు. ఇక త్రిబుల్ ఆర్ అనేది ఇద్దరు విప్లవ వీరుల పాత్రల స్ఫూర్తితో కల్పిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఇందులో ఎమోషనల్, యాక్షన్ తప్పా డ్యూయెట్లకు, గ్లామర్‌కు స్కోప్ లేదు.. ఉండదని కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన పాటల్లో ఒక్క నాటు నాటు ఒక్కటి మాత్రమే ఆకట్టుకుంది. మిగిలిన పాటలు జనాలకు పెద్దగా ఎక్కలేదు.. ఇది వాస్తవం.
బాహుబలిలో ప్రభాస్ – రానాతో పాటు అనుష్క, తమన్నా గ్లామర్ .. ముగ్గురు హీరోయిన్లతో ఐటెం సాంగ్ ఇవన్నీ ఉన్నాయి. త్రిబుల్ ఆర్‌కు ఎంత లేదన్నా హీరోయిన్లు మైనస్. పైగా వీరి పాత్రలకు పెద్ద స్కోప్ ఉన్నట్టుగా కూడా లేదు. ఇక అజయ్‌దేవగన్, శ్రీయా, ఆలియాభట్ ఉన్నా.. వారి పాత్రలు కూడా లిమిటెడ్‌గానే ఉంటాయంటున్నారు. ఇక బాహుబలి టైంకు ఇప్పుడు ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. పైగా ఇప్పుడు త్రిబుల్ ఆర్‌కు పోటీగా చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి.
విజయ్ బీస్ట్, కేజీఎఫ్ 2, ఆచార్య, సర్కారు వారి పాట ఉన్నాయి. దీనికి తోడు భీమ్లానాయక్ లాంటి సినిమాలు అదే రోజు ఓటీటీలో వస్తున్నాయి. ఎంతలేదన్నా కరోనా తర్వాత చాలా మంది థియేటర్లకు రావడం లేదు. ఈ గట్టి పోటీ మధ్యలో త్రిబుల్ ఆర్ బాహబలి ది కంక్లూజన్ వసూళ్లు బ్రేక్ చేయడం అసాధ్యంగానే కనిపిస్తోంది.