త్రిబుల్ ఆర్ రిలీజ్‌కు మరో ఐదారు రోజుల టైం ఉన్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మానియా స్టార్ట్ అయిపోయింది. ఎవ్వరి నోట విన్నా కూడా అర్ధరాత్రి షో ఖచ్చితంగా చూసేయాలన్న మాటే వినిపిస్తోంది. ఏపీ, తెలంగాణలో కూడా ప్రభుత్వాల నుంచి అదనపు టిక్కెట్ రేట్లు, అదనపు షోల కోసం ఫుల్ పర్మిషన్లు వచ్చేశాయి. ఇక వసూళ్ల జాతర విషయంలో ఎలాంటి అడ్డూ అదుపు లేదు. సినిమాకు మంచి టాక్ రావాలే కాని.. టిక్కెట్ రేటు ఎంత అయినా కొనేందుకు రెడీగా ఉన్నారు.
ఇక ఇప్పటికే ఇటు ఎన్టీఆర్ అభిమానులు, అటు రామ్‌చరణ్ అభిమానులు కూడా టిక్కెట్లు, షోల విషయంలో తమకే ఇవ్వాలని నానా రాద్దాంతం చేస్తున్నారు. మెగా, నందమూరి అభిమానుల ఆనందానిక అవధులు లేవు. ఇక షోలు 24వ తేదీ రాత్రి నుంచి ప్రారంభించాలా ? లేదా అర్ధరాత్రి దాటాక స్టార్ట్ చేయాలా ? అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఇదే విషయమై రాజమౌళి స్పందిస్తూ ఇది డిస్ట్రిబ్యూటర్లు తీసుకునే నిర్ణయం అని చెప్పారు.
ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ అయ్యే 25వ తేదీ తెల్లవారు ఝామున 4 గంటలకు కూకట్‌పల్లి, మూసాపేట ప్రాంతాల్లో ఆరు స్పెషల్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ షోలకు టిక్కెట్ రేటు రు. 5 వేలుగా పెట్టారు. ఈ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న దిల్ రాజు ఈ 6 షోలను భారీ రేట్లకు అమ్మేశారు. దీంతో ఈ షోలు కొన్న వారు తమ లాభాలు, అక్కడ పబ్లిసిటీ ఖర్చు.. లాభం అన్ని కలుపుకుని ఏకంగా టిక్కెట్ రేటు రు 5 వేలుగా ఫిక్స్ చేశారు. టిక్కెట్ రేటు రు. 5 వేలు అంటే చాలా ఎక్కువే.
మరీ సాధారణ ప్రేక్షకుడు అయితే ఇంత రేటు పెట్టి సినిమా చూడలేడు. తెల్లారితే రు. 200 పెడితే మంచి థియేటర్లోనే టిక్కెట్ కొని సినిమా చూడొచ్చు. అయితే సాఫ్ట్‌వేర్ వాళ్లో లేదా ధనవంతులో మెగా, నందమూరి వీరాభిమానులో మాత్రం టిక్కెట్ రేటు ఇంతున్నా కూడా ఆ షోలు చూసేందుకే రెడీ అయిపోతున్నారు. ఇక ఈ 6 షోలకు టిక్కెట్ రేటు రు. 5 వేలు పెట్టినా.. అన్నీ ఫుల్ అవుతాయనే అంటున్నారు. అంటే సుమారుగా 5 వేల టిక్కెట్లు.. 5 వేల రెట్లు.. అంటే ఓవరాల్‌గా ఈ ఆరు షోల వ్యాపారమే రు 2.5 కోట్లు.
అయితే ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. తాము కొనలేనంతగా టిక్కెట్ రేట్లు పెడుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఇది మామూలు దోపిడీ కాదని.. సినిమాపై ఉన్న క్రేజ్, ఎలాగైనా షో చూడాలన్న ఫ్యాన్స్ బలహీనత బేస్ చేసుకుని.. తీవ్రమైన దోపిడీకి తెరలేపారని వారు విమర్శలకు దిగుతున్నారు. మరి ఈ దోపిడీని కంట్రోల్ చేస్తారా ? లేదో ? చూడాలి.