దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం ( త్రిబుల్ ఆర్ ) సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆల్ టైం రికార్డులు సెట్ చేస్తూ దూసుకు పోతోంది. ఇప్పటికే బాహుబలి 2 రికార్డులకు చేరువ అయిన ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికే బాహుబలి 2 లాంగ్ రన్ రికార్డులు బీట్ చేసేలా దూసుకు పోతోంది. ఇక ఆదివారం ఏపీ, తెలంగాణలో ఈ సినిమా రు. 33 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టి.. ఓవరాల్‌గా 3 రోజులకు ఏపీ, తెలంగాణలో ఈ సినిమా నెట్ వసూళ్లు రు. 140 కోట్లకు చేరుకున్నాయి.
మూడు రోజులకు ఏపీ, తెలంగాణలోనే రు. 140 కోట్ల నెట్ వసూళ్లు అంటే అది మామూలు అరాచకం కాదు అనే చెప్పాలి. ఇక మూడో రోజు వరకు చూస్తేనే రు. 33 కోట్లు వచ్చాయి. మూడు రోజులకు కేవలం ఏపీ, తెలంగాణలో మాత్రమే రు. 33 కోట్ల షేర్ రాబట్టిన త్రిబుల్ ఆర్ టాప్‌లో ఉంది. ఇక్కడ ఈ సినిమాకు రు. 191 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటికే రు. 140 కోట్లు వచ్చాయి. అంటే మరో రు. 51 కోట్ల షేర్ వస్తే సరిపోతుంది.
ఈ జోరు చూస్తుంటే ఈ షేర్ రాబట్టడం పెద్ద విశేషం కాదు. బాహుబలి 2 చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో 204 కోట్ల రూపాయల వసూళ్లతో టాప్ లో ఉంది. ఈ వసూళ్లు చూస్తుంటేనే కళ్లు జిగేల్ మంటున్నాయి. ఈ వీకెండ్‌లో కూడా త్రిబుల్ ఆర్ ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే త్రిబుల్ ఆర్ బ్రేక్ ఈవెన్ దాటడమే కాదు.. బాహుబలి రికార్డులను కూడా సులువుగానే బద్దలు కొడుతుంది. ఇక లాంగ్ రన్లో ఈ సినిమా ఎంత వసూళ్లు రాబడుతుందో ? చూడాలి.
ఇక ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించగా.. ఆలియా భట్, ఓలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇక బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్, శ్రియా చరణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలో నటించారు. డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను రు. 500 కోట్ల బడ్జెట్తో నిర్మించారు.