వామ్మో తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాకుండా.. ఇండియన్ సినిమా జనాలు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఉన్నా కూడా ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఫీవర్ పట్టేసుకుంది. ఈ సినిమా రిలీజ్‌కు మరో 6 రోజుల మాత్రమే టైం ఉంది. ఎక్కడికక్కడ ప్రేక్షకులు ఆ మానియాలో మునిగి తేలుతున్నారు. మూడున్నర సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ 6 రోజులు ఎప్పుడు పూర్తవుతాయా ? అని క్షణం క్షణం ఎంతో టెన్షన్‌తో ఉంటున్నారు. ఇక బాహుబలి ది కంక్లూజన్ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఆకాశాన్ని కూడా దాటేశాయ్..!
ఇక ఇప్పటికే రాజమౌళి తనకు కావాల్సిన వాళ్లకు షో అయితే వేసి మరీ చూపించాడు. రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు చరణ్, ఎన్టీఆర్.. నిర్మాత దానయ్య టీం.. ఈ సినిమాకు పనిచేసిన కొందరు అయితే షో చూసేశారు. వాళ్లంతా యునానమస్‌గా సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ తీసుకువచ్చేశారు. బాహుబలి 1 రు. 650 కోట్ల వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 వసూళ్లు రు. 2 వేల కోట్లు దాటిపోయాయ్. అసలు ఈ రికార్డులు చూసి ఇండియన్ సినిమా జనాల మైండ్ బ్లాక్ అయిపోయింది.
రాజమౌళి ఏంటి ఈ సినిమా వసూళ్లు ఏంట్రా బాబు అని ఆశ్చర్యపోయారు. దేశ సినిమాను శాసిస్తున్నాం అని చెప్పుకునే బాలీవుడ్ స్టార్స్ వణికిపోయారు. అప్పట్లో ఈ రికార్డును బ్రేక్ చేయాల్సి వస్తే.. మళ్లీ రాజమౌళి మాత్రమే బ్రేక్ చేస్తాడన్న చర్చ వచ్చింది. ఇప్పుడు అది త్రిబుల్ ఆర్‌తో తీరుతుందా ? అన్నదే ప్రతి ఒక్కరిలో ఉన్న ఆతృత. అయితే బాహుబలి 2 రికార్డులను రాజమౌళి త్రిబుల్ ఆర్‌తో బ్రేక్ చేయబోతున్నట్టు కలరిస్ట్ శివకుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
త్రిబుల్ ఆర్ సినిమా బాహుబలి 2 వసూలు చేసిన రు. 2 వేల కోట్ల రికార్డులను బీట్ చేయడంతో పాటు ఏకంగా రు. 3 వేల కోట్ల వసూళ్లు సాధించి హాలీవుడ్ సినిమాల రేంజ్‌లో నిలవబోతోందని శివకుమార్ చెపుతున్నాడు. తాను ఆర్ ఆర్ ఆర్ మళయాళ వెర్షన్ చూశానని.. సినిమా అదిరిపోయిందని చెపుతున్నాడు. ఎన్నో సినిమాలకు ఫైనల్ అవుట్ ఫుట్ ముందుగా చూసే అవకాశం కలరిస్ట్ అయిన శివకుమార్‌కు మాత్రమే దక్కుతుంది. అలాగే త్రిబుల్ ఆర్ సినిమాను కూడా ప్రపంచం కంటే ముందే ఆయనకే చూసే అవకాశం దక్కింది.
ఈ సినిమాకు కలరిస్ట్‌గా శివకుమార్ వ్యవహరించాడు. శివకుమార్ రు. 3 వేల కోట్ల వసూళ్లు కొల్లగొడుతుందని చెప్పడంతో ఇప్పుడు ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. శివకుమార్ రివ్యూతో సినీ అభిమానులు త్రిబుల్ ఆర్ ఎప్పుడు చూడాలా ? అని మరింతగా ఊగిపోతున్నారు. తాను కలరిస్ట్‌గా ఒక్కో ఫ్రేమ్‌ను వెయ్యి సార్లకు పైగా చూసే అవకాశం దక్కిందని.. తాను ఎంతో నమ్మకంగా చెపుతున్నాను.. ఆర్ ఆర్ ఆర్ ఓ రికార్డ్ బ్రేకింగ్ మూవీ.. మూడు వేల కోట్లు అనేవి ఈ సినిమాకు సాధ్యం అంటూ చెప్పాడు. మరి శివకుమార్ చెప్పినట్టు రాజమౌళి మరోసారి తన రికార్డ్‌ను తానే ఎంత వరకు బ్రేక్ చేస్తాడో ? చూడాలి.