త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్‌కు ముందు బాలీవుడ్‌లో పెద్ద హైప్ రాలేదు. నార్త్ మీడియా కూడా సినిమాను పట్టించుకోలేదు. ఇందుకు కారణం వరుసగా సౌత్ సినిమాలు.. అందులోనూ తెలుగు సినిమాలు బాలీవుడ్‌ను శాసిస్తున్నాయి. అసలు ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే పుష్ప సినిమా బాలీవుడ్‌లో ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే ఏకంగా రు. 100 కోట్లు కొల్లగొట్టింది. ఆ వసూళ్లు చూసి బాలీవుడ్ వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్, ఆ తర్వాత కేజీయఫ్ 2 ఇలా వరుసగా సౌత్ సినిమాలు దాడి చేస్తే మన ఇండస్ట్రీ ఏమైపోతుందన్న భయం వాళ్లను వెంటాడుతోంది.
పైగా బాహుబలి ది కంక్లూజన్ వసూళ్లు చూశాక అసలు తెలుగు సినిమా.. అందులోనూ రాజమౌళి సినిమా అంటేనే బాలీవుడ్ వర్గాలు భయపడుతున్నాయి. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ సినిమా గంగూబాయి, కశ్మీర్ ఫైల్స్‌తో కాస్త ఫికప్ అవుతోంది. ఈ టైంలో త్రిబుల్ ఆర్ సినిమాను ఎందుకు నెత్తిన పెట్టుకోవాలని వారు కాస్త కక్ష ధోరణితోనే ఉన్నారు. ఇక సినిమా రిలీజ్‌కు ముందు నార్త్ ప్రమోషన్ల కోసం రాజమౌళి, తారక్, చెర్రీ కూడా గట్టిగానే కష్టపడ్డారు.
ఇక ఫస్ట్ రోజు త్రిబుల్ ఆర్‌కు నెగిటివ్ టాక్ తేవాలని చాలా ట్రై చేశారు. కానీ సినిమాలో ఉన్న దమ్ము వాళ్ల నోట ఆ మాట రానియ్యలేదు. అప్పటికే నార్త్‌లో త్రిబుల్ ఆర్‌కు తిరుగులేని బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చేసింది. అయితే ఫస్ట్ డే బాహుబలి 2, చివరకు సాహో వసూళ్లతో కంపేరిజన్ చేసుకున్నా తక్కువే వచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. ఇంకేముందు త్రిబుల్ ఆర్ నార్త్‌లో ప్లాపే అనుకున్నారు అందరూ..!
అయితే రెండో రోజు నుంచి నార్త్ బెల్ట్‌లో సినిమా మెల్లమెల్లగా ఫికప్ అవుతూ వచ్చింది. ఎవరో ఒకరిద్దరు మినహా అందరూ కూడా సినిమా బాగుందని అంటున్నారు. ఫలితంగా 5 రోజులకే రు. 100 కోట్ల నెట్ వసూళ్లు సాధించేసింది. ఈ సినిమాను నార్త్‌లో రు. 91 కోట్లకు అమ్మారు. ఐదు రోజులకే అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయి బాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు ట్రేడ్ వర్గాల మైండ్ బ్లాక్ అయిపోయేలా చేసింది.
జస్ట్ ఐదే ఐదు రోజుల్లో ఏకంగా రు. 107 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. లాంగ్ రన్లో ఈ సినిమా రు. 200 కోట్ల షేర్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఐదో రోజు ఏకంగా రు. 16 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఏదేమైనా సౌత్ సినిమాను ఎప్పటికప్పుడు చిన్న చూపు చూస్తూ వస్తోన్న బాలీవుడ్ స్టార్లకు, ట్రేడ్ వర్గాల వారి గర్వాన్ని మరోసారి త్రిబుల్ ఆర్ నిర్దాక్షిణ్యంగా అణిచివేసింది.