రాజమౌళి త్రిబుల్ ఆర్ అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్‌ను కుమ్మి పడేసింది. మూడున్నర సంవత్సరాలుగా ఎంతో ఉత్కంఠ రేపిన ఈ సినిమా గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు పూర్తి కావొస్తోన్న వేళ కలెక్షన్ల వేట మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రు. 700 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టేసింది. ఈ వసూళ్లు లాంగ్ రన్లో ఎక్కడ ఆగుతాయో ? అని ట్రేడ్ వర్గాలు ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. ఇప్పటికే చాలా రికార్డులు బ్రేక్ చేసిన త్రిబుల్ ఆర్ ఇప్పుడు పలు దేశాల్లో సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తోంది. రాజమౌళి బాహుబలి – ది కంక్లూజన్ సినిమా చైనా లాంటి దేశాల్లో ఊచకోత కోసేసింది.
ఈ సినిమా జపాన్‌లోనూ అదర గొట్టేసింది. అమెరికాలో సరేసరి.. అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్ మన పొరుగు దేశం నేపాల్లో సరికొత్త చరిత్ర లిఖించింది. నేపాల్ సినిమా చరిత్రలో మరే సినిమాకు లేనంత భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు చూస్తే ఆ దేశ చరిత్రలో మరే సినిమా త్రిబుల్ ఆర్ దరిదాపుల్లో కూడా లేదు. ఇక గ్లోబల్ బాక్సాఫీస్ కలెక్షన్లలో ఈ విషయం ఇప్పటికే టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిన త్రిబుల్ ఆర్ నేపాల్లో కొత్త చరిత్ర తిరగరాయడంతో ఇండియన్ బాక్సాఫీస్ వర్గాలు షాక్‌లోకి వెళ్లిపోయాయి.
సినిమా విడుదలైన ఫస్ట్ డే నేపాల్లో ఈ సినిమాకు కోటి రూపాయలు వచ్చాయి. ఈ వసూళ్లు నేపాలీ కరెన్సీలో కావడం విశేషం. ఇక రెండో రోజు నుంచి అక్కడ మరింత ఫికప్ అయిన త్రిబుల్ ఆర్ ఫస్ట్ వీక్ ముగియకుండానే ఇప్పటికే రు. 7 కోట్ల వసూళ్లు సొంతం చేసుకుంది. నేపాల్లో ఈ రేంజ్ వసూళ్లు సాధించిన తొలి సినిమాగా రికార్డులకు ఎక్కింది. మన రూపాయితో పోలిస్తే నేపాల్ రూపాయి విలువ 1.60 పైసలు ఉంటుంది.
ఈ రేంజ్ వసూళ్లు నేపాల్ సినిమా చరిత్రలోనే లేవని.. అక్కడ బాక్సాఫీస్ విశ్లేషకులు చెపుతున్నారు. ఇక ఇప్పటికే హిందీలో ఐదు రోజులకే రు. 110 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ సినిమా రు. 200 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇక బాలీవుడ్‌లో ఈ సినిమాను రు. 92 కోట్లకు అమ్మారు. ఈ లెక్కన చూస్తే రూపాయికి రూపాయి లాభం వచ్చేలా ఉంది. అటు ఓవర్సీస్‌తో పాటు ఇటు సౌత్ రాష్ట్రాల్లోనూ త్రిబుల్ ఆర్ భీకర విధ్వంసం ఆగడం లేదు.