దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఎమోషనల్ విజువల్ వండర్ త్రిబుల్ ఆర్. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబోలో వచ్చిన ఈ మల్టీస్టారర్ మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకు అన్ని భాషల్లోనూ యునానమస్ హిట్ టాక్ రావడంతో ఇండియా టు ఓవర్సీస్ ఎక్కడ చూసినా థియేటర్లు అన్ని ప్రేక్షకులతో కిక్కిరిసి ఉన్నాయి. అసలు ఫస్ట్ వీకెండ్ థియేటర్లు ఖాళీలేవు.
ఇక ఇది ఎంత పాన్ ఇండియా సినిమా అయినా.. ప్రపంచ స్థాయి సినిమా అయినా కూడా ముందు మన తెలుగు సినిమా. దీంతో ఈ సినిమాను తెలుగు వాళ్లు హీరోల అభిమానులు అన్న దాంతో సంబంధం లేకుండా అందరూ మన సొంత సినిమాగా ఓన్ చేసుకుంటారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ఈ సినిమాకు బాగా సపోర్ట్ చేశాయి.
ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణలో రు. 191 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లు రాబట్టింది అన్న ఆతృత అందరిలోనూ ఉంది. ఇక తాజాగా వస్తోన్న బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా పాత రికార్డులను అన్నింటిని బ్రేక్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో భీభత్సం చేసేసింది. గతంలో నమోదు అయిన బాహుబలి 2 వసూళ్లను చాలా సింపుల్‌గా చెరిపేసింది.
బాహుబలి 2 చిత్రం తొలి రోజు 36 లక్షలు వసూలు చేస్తే.. ఇటీవల భీమ్లా నాయక్ 38 లక్షలు, పుష్ప చిత్రం 41 లక్షలు రాబట్టాయి. ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఏకంగా రు. 77 లక్షలు రాబట్టింది. ఇక నైజాంలో పాత రికార్డులను బీట్ చేస్తూ ఫస్ట్ డే 23.25 కోట్లు వసూలుచేసింది. ఇప్పటి వరకు నైజాంలో భీమ్లా నాయక్ 11.85 కోట్లుతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
ఇక ఏపీలో ఏరియాల వారీ ఫస్ట్ డే వసూళ్లు చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో 5.93 కోట్లు – గుంటూరులో 7 కోట్లు – నెల్లూరులో 3 కోట్లు – రాయలసీమ లో 1.23 కోట్లు సాధించింది. ఓవరాల్‌గా ఏపీ, నైజాంలో ఫస్ట్ డే రు. 70 కోట్లకు పైగా షేర్.. రు. 130 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఏదేమైనా మరోసారి తెలుగు సినిమా స్టామినా ఇండియా వైజ్‌గా చాటిన సినిమాగా త్రిబుల్ ఆర్ రికార్డులకు ఎక్కింది. ఇక ఓవర్సీస్‌లో రు. 41 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు సమాచారం.