వామ్మో ఈ త్రిబుల్ ఆర్ ఏందిరో అని అమెరికన్ సినిమా వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి. బాహుబలి ది కంక్లూజన్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. సినిమాకు మంచి టాక్ వచ్చింది. అయితే అంతకంటే ముందే మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో అన్ని థియేటర్లలో టిక్కెట్లు బుక్ అయిపోయాయి. దీంతో ఈ సినిమా ఫస్ట్ డే వసూళ్లు ఎలా ? ఉంటాయా ? అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న 14 భాషల్లో రిలీజ్ చేశారు.
హిందీలో అది కూడా ఒక్క ఇండియాలోనే 3400 స్క్రీన్లు ఇచ్చారు. ఓవర్సీస్‌లోనే 1100 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.. రిలీజ్‌కు ముందే ఎలాంటి అరాచకంతో అంచనాలు ఉన్నాయో అర్థమవుతోంది. దీంతో ఫస్ట్ డే వసూళ్ల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. అధికారికంగా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ వసూళ్లు బయటకు రాకపోయినా రు. 200 కోట్లకు పైనే ఉంటాయని అంచనా.
ఇదిలా ఉంటే యూఎస్ బాక్సాఫీస్‌పై త్రిబుల్ ఆర్ సింహంలా గర్జించింది. రిలీజ్‌కు 20 రోజుల ముందు నుంచే అక్కడ అడ్వాన్స్ బుకింగ్‌లు స్టార్ట్ అయ్యాయి. అక్కడ షో పడకుండానే 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లు బుకింగ్‌తో వచ్చేశాయి. ఇక ఫస్ట్ డే ముగిసే సరికి యూఎస్‌లో త్రిబుల్ ఆర్ మొత్తం 5 మిలియన్ డాలర్ల వసూళ్లతో అరాచకం క్రియేట్ చేసింది. అంటే దాదాపుగా రు. 38 కోట్లకు కాస్త అటూ ఇటూగా వసూళ్లు వచ్చినట్టు టాక్ ?
కేవలం ఫస్ట్ డేకే ఈ రేంజ్ వసూళ్లు అంటూ మామూలు విషయం కాదు. ఇండియన్ హిస్టారికల్ చరిత్రలోనే ఇదో అసాధారణ రికార్డుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ సినిమాను అక్కడ రు. 65 కోట్లకు అమ్మారు. మరి లాంగ్ రన్‌లో ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుంది అన్నది చూడాలి. రు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రు. 1000 కోట్ల వసూళ్ల టార్గెట్‌తో రంగంలోకి దిగింది.