ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు.. భారతదేశ సినీ అభిమానులు అందరూ ఉత్కంఠతో ఎదురు చూసిన త్రిబుల్ ఆర్ సినిమా ఈ రోజు థియేటర్లలోకి వచ్చేసింది. ఓవర్సీస్‌తో పాటు ఏపీ, తెలంగాణలో ప్రీమియర్లు పడిపోయాయి. టాక్ ఎక్కడికక్కడ స్ప్రెడ్ అవుతోంది. సినిమా ఎలా ? ఉందనే దానిపై ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. ఇక ఇద్దరు స్టార్ హీరోల్లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఎవరి పాత్ర బాగా పండింది ? రాజమౌళి ఇద్దరిలో ఎవరిని హైలెట్ చేశారు ? ఇలా చాలా చర్చలే స్టార్ట్ అయిపోయాయి.
వాస్తవంగా చూస్తే ఫస్టాఫ్‌లో తారక్ పాత్ర డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. చరన్ ఎంట్రీ సింపుల్‌గా కానిచ్చేశాడు. తారక్ పాత్ర ఎలివేషన్ మామూలుగా లేదు. ఇక పులితో ఫైట్ సీన్లో తారక్ వన్ మ్యాన్ షో మామూలుగా లేదు. అరాచకానికే ఇది అమ్మ మొగుడు అయిపోయింది. ఇక ఇద్దరు కలుసుకునే పాత్ర అదిరిపోయింది. నదిలో వంతెనపై వెళుతోన్న గూడ్స్ బండికి నిప్పుంటుకుని కింద నదిలో మంటలు వస్తాయి. అక్కడ పడవలో ఉన్న పిల్లాడు మంటల్లో చిక్కుకుంటాడు.
ఈ పిల్లాడిని కాపాడే సీన్లోనూ రాజమౌళికి ఇద్దరికి ఈక్వల్ ఎలివేషన్‌తో ఆ సీన్ హైలెట్ చేశాడు. ఇక క్లైమాక్స్‌లో చరణ్‌కు అల్లూరి సీతారామరాజు గెటప్ వేయడంతోనే ఆ పాత్రకు అక్కడ బాగా ప్రాధాన్యం ఇచ్చేసినట్లయ్యింది. క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ పాత్ర ప్రయార్టీ తగ్గిందన్న ఫీల్ ఉంది. అయితే ఆ లోటు ఫస్టాఫ్‌లో తీరిపోయింది. ఫైట్స్‌లో చరణ్ పాత్ర డామినేషన్ ఉంటే.. ఎలివేషన్ సీన్లు… పాత్ర పరంగాను, ఎమోషనల్ పరంగాను తారక్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది.
విచిత్రం ఏంటంటే ఇద్దరు హీరోయిన్లతోనూ తారక్‌కే మంచి సీన్లు పడ్డాయి. అసలు హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం లేని ఈ సినిమాలో తారక్ – ఓవీలియో సీన్లే బాగున్నాయి. ఆలియా – చరణ్ మధ్య సీన్లు కట్టె కొట్టే తెచ్చేలా ఉన్నాయి.