టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ త్రిబుల్ ఆర్. డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా మూడున్నర సంవత్సరాలుగా ఊరిస్తూ ఎట్టకేలకు ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 11 వేల స్క్రీన్లలో రిలీజ్ అయిన ఇప్పటికే అటు ఓవర్సీస్‌తో పాటు ఇటు అమెరికాలో ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుంది.
షో చూసిన ప్రతి ఒక్కరు బొమ్మ బ్లాక్‌బస్టరే అంటున్నారు. సినిమా ఫస్టాఫ్ రిపోర్ట్ చూస్తే రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు ఎంట్రీలు చూడడానికి రెండు కళ్లు చాలలేదు. అటు ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా గ్రాండ్‌గా డీసెంట్‌గా సాగింది. కీరవాణి నేపథ్య సంగీతం మనలను మైమరిపింపజేసింది. పాటలు బాగున్నాయి. సినిమా స్టార్టింగే గోండ్ల తెగకు సంబంధించిన సన్నివేశాలతో రాజమౌళి స్టార్ట్ చేశాడు.
ముందుగా రామ్‌చరణ్ ఎంట్రీ ఉంటుంది. హై ఓల్టేజ్ సన్నివేశాలతో చరణ్ ఎంట్రీ విజువల్స్ బాగున్నాయి.
ఆ తర్వాత హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్‌తో తారక్ గ్రాండ్ ఎంట్రీ .. కళ్లు చెదిరిపోయే రేంజ్‌లో ఉంటుంది. ఆ తర్వాత రామ్‌చరణ్ బ్రిటీష్ ప్రభుత్వ ఆదేశాల మేరకు తారక్ కోసం వెతకడం లాంటి సీన్లతో ఫస్టాఫ్ కథ అంతా నడుస్తుంది. అప్పటి వరకు ప్లాట్‌గా సాగిన సినిమా ఎప్పుడు అయితే చరన్, ఎన్టీఆర్ మధ్య సంఘర్షణ మూడ్‌లోకి వెళుతుందో అప్పుడు ఒక్కసారిగా స్పీడప్ అవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. ఫస్టాఫ్‌లో దోస్తీ, నాటు నాటు పాటలు సినిమా గ్రాఫ్‌ను పెంచడంతో పాటు హైలెట్‌గా నిలిచాయి.
కీలకమైన సెకండాఫ్‌లో రామ్‌చరన్ ప్లాష్‌బ్యాక్‌తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అజయ్ దేవగన్ ఎంట్రీ ఇవ్వడం.. చరణ్ – అజయ్ మధ్య సీన్లు బాగున్నాయి. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు సినిమాను చాలా ఆసక్తికరంగా మార్చేశాయి. ఈ టైంలో వచ్చే కొమురం భీముడో అనే ఎమోషనల్ సాంగ్ భావోద్వేగ వాతావరణం క్రియేట్ అయ్యేలా చేస్తుంది. రాజమౌళి నటనతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఇద్దరు హీరోల సామర్థ్యాన్ని బాగా వాడుకుని వాళ్లను పిండేశాడనిపిస్తుంది.
సెకండాఫ్‌లో మాత్రం కథ 30 నిమిషాల పాటు కాస్త ల్యాగ్ అయినట్టే కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త డల్ అయినట్టుగా.. కొన్ని చోట్ల రొటీన్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కళ్లు చెదిరిపోయేలా డిజైన్ చేసుకున్నా.. ఫార్మాట్ రొటీన్‌గా ఉందా ? అన్న చిన్న డౌట్ ఉంది. అయితే ఒకటి, రెండు కంప్లైంట్లు ఉన్నా కూడా రామ్‌చరణ్, తారక్ అదిరిపోయే పెర్పామెన్స్.. రాజమౌళి దర్శకత్వం ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ చేసి పడేశాయి. రికార్డుల వేట మొదలైంది.. ఇక ఒక్కోటి రాసిపెట్టుకోవడమే మిగిలి ఉంది.