యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ సినిమా రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇంకా చెప్పాలంటే భారత సినిమా చరిత్రను బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అన్నట్టుగా ఇది రికార్డులు నమోదు చేసింది. భారత సినిమా పరిశ్రమ వైపు ప్రపంచ సినిమా ఇండస్ట్రీలు అన్ని చూసేలా చేసిన ఘనత మాత్రం ఖచ్చితంగా బాహుబలి ది కంక్లూజన్‌కే దక్కుతుంది. ఆ తర్వాత అమీర్‌ఖాన్ దంగల్ కూడా ఆ రేంజ్‌లో ఆడినా.. ఇండియాలో ఎక్కువ వసూళ్లు రాబట్టిన ఘనత బాహుబలి 2దే.
ఈ సినిమా వచ్చి ఐదేళ్లు అవుతోంది. ఆ తర్వాత ఎన్నో పెద్ద సినిమాలు వచ్చినా బాహుబలి 2 రికార్డుల దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. అందుకే బాహుబలి 2 రికార్డులు ఏళ్ల తరబడి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ రాజమౌళి డైరెక్ట్ చేసిన త్రిబుల్ ఆర్ రేపు థియేటర్లలోకి దిగుతోంది. రిలీజ్ పరంగా చూసుకుంటే బాహుబలి 2 కన్నా త్రిబుల్ ఆర్‌దే బిగ్గెస్ట్ రిలీజ్. అయితే రిలీజ్ బిఫోర్ వాతావరణం చూస్తే మాత్రం బాహుబలి 2కే ఇప్పుడు త్రిబుల్ ఆర్ కన్నా ఎక్కువ ప్లస్ పాయింట్లు.. సానుకూలతలు ఉన్నాయి.
సరే ఏదెలా ఉన్నా బాహుబలి 2 ఫస్ట్ డే రు. 43 కోట్ల షేర్ దక్కించుకుంది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఆ రికార్డును బీట్ చేసే స్థాయిలో వసూళ్లు ఉంటాయా ? ఉండవా ? అన్న చర్చలే నడుస్తున్నాయి. సహజంగానే ఈ రికార్డును కంపేరిజన్ చేసి చూడడం కామన్. అయితే త్రిబుల్ ఆర్‌కు ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్‌లు చూస్తుంటే ఫస్ట్ డే షేర్ విషయంలో బాహుబలి 2 రికార్డులు బీట్ అవుతాయనే అంటున్నారు.
మొదటి రోజు ఆర్ ఆర్ ఆర్ సినిమా 60 నుండి 62.5 కోట్ల షేర్ ను దక్కించుకునే అవకాశం ఉందని ఇప్పటి వరకు ఉన్న అడ్వాన్స్ బుకింగ్‌లను బట్టి ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ డే వసూళ్ల విషయంలో ఇండియన్ సినిమాకే సరికొత్త భాష్యం చెప్పేలా వసూళ్లు ఉండబోతున్నా యంటున్నారు. అయితే లాంగ్ రన్‌లో మాత్రం బాహుబలి 2 వసూళ్లను బీట్ చేసే ఛాన్స్ ఉండదేమో అన్న టాక్ అయితే బయటకు వచ్చింది. మరి త్రిబుల్ ఆర్ రికార్డుల వేట డే వన్ నుంచి ఎలా స్టార్ట్ అవుతుందో ?