మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఓ వైపు త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యింది. యాక్టింగ్ పరంగా చరన్ కెరీర్‌లోనే నెంబర్ వన్ సినిమా అన్న ప్రశంసలు వస్తున్నాయి. ఇక చరణ్ పాన్ ఇండియా హీరోగా ఎదిగేందుకు కూడా ఈ సినిమా బాగా యూజ్‌ఫుల్ అవుతోంది. చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఇక చరణ్ ఎంట్రీ సీన్, క్లైమాక్స్ వేరే లెవల్లో ఉన్నాయని అంటున్నారు.
ఇక త్రిబుల్ ఆర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న రామ్‌చరణ్.. ఇటు తన బర్త్ డే వేడుకలను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే త్రిబుల్ ఆర్ సక్సెస్ తర్వాత చరణ్ మరి కొద్ది రోజుల్లోనే మరోసారి ఆచార్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తన తండ్రి చిరంజీవితో కలిసి చెర్రీ ఆచార్య సినిమా చేస్తున్నాడు. వచ్చే నెల 29న ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ రెండు సినిమాల సంగతి ఇలా ఉండగానే తన కెరీర్‌లో 15వ సినిమాను నెంబర్ వన్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇదిలా ఉంటే చెర్రీ – ఉపాసన దంపతులు ఇటీవల కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఇంటిని వీళ్లు రు. 100 కోట్లతో తమ కలలకు అనుగుణంగా, అభిరుచులతో నిర్మించుకున్నారు.
ఈ ఇంటి కోసం ఏకంగా ఇటలీ నుంచి ఇంటీరియర్ డైజన్ కోసం కరారా పాలరాయిని తెప్పించారు. ఇందుకోసమే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇక లోపల వుడ్ వర్క్ మెటీరియల్ కూడా యూరప్ నుంచే తెప్పించారు. అత్యంత ఖరీదైన ఈ వుడ్ ఇటలీ నుంచి షిఫ్‌లో ఇండియాకు రావడానికే చాలా ఖర్చయ్యింది. ఇక స్పెషల్ డిజైన్స్, లగ్జీరీయస్ లుక్ కోసం చెర్రీ, ఉపాసన ఎక్కడా రాజీపడలేదు.
అయితే ఇప్పుడు రు. 5 కోట్లు పెట్టి మరీ ఆ బంగ్లాని రీ మోడలింగ్ చేయిస్తున్నారట. ఈ బంగ్లా రీ మోడలింగ్ చేయించడం ఇది రెండోసారి.. ఈ ఇళ్లు కట్టి రెండేళ్లు కూడా అయ్యిందో లేదో అప్పుడే రెండోసారి రీ మోడలింగ్‌కు రెడీ అయిపోయారు. ఓవరాల్‌గా ఇంటి పై లుక్ కంటే. లోపల లుక్ చూస్తుంటే ఇంద్రభవనం ఎందుకు సరిపోద్ది అనేలా ఉంటుంది. ఇప్పటికే ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి కొన్ని ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది.