రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ త్రిబుల్ ఆర్. ఈ సినిమా థియేటర్లలోకి దిగేందుకు మరి కొద్ది గంటల టైం మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా త్రిబుల్ ఆర్ హంగామా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక షో ఎప్పుడు పడుతుందా.. మిగిలి ఉన్న ఈ కొద్ది గంటలు ఎప్పుడు పూర్తవుతాయా ? అన్న ఉత్కంఠ ఒక్కటే ఉంది. బాహుబలి ది కంక్లూజన్ లాంటి ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాసిన సినిమా తర్వాత వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు అయితే తారా స్థాయిలోనే ఉన్నాయి. ఇవి స్కై రేంజ్‌ను టచ్ చేశాయి.
ఇక ప్రమోషన్లలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి ముగ్గురు దుమ్ము రేపుతున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ గత రెండు రోజులుగా ప్రమోషన్లలో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఓ ఆసక్తికర ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. కమ్మ ఎన్టీఆర్ – కాపు రామ్‌చరణ్‌లతో సినిమా తీసి రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా ? అన్న ప్రశ్నకు ఆయన అలాంటిదేమి లేదని ఆన్సర్ చేయడంతో పాటు తమ కుటుంబానికి కుల పట్టింపులు ఉండవని.. తన భార్య కాపు అని తొలిసారిగా చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటించిన రామ్‌చరణ్, కొమరం భీంగా నటించిన ఎన్టీఆర్ ఇద్దరి నటనలో ఎవరి పాత్రకు మీరు ఎక్కువ మార్కులు వేస్తారన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఈ ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్ ఆన్సర్ ఇస్తూ అడవి తల్లి బిడ్డగా నటించినందువల్ల కొమరం భీం పాత్ర తనకు బాగా నచ్చిందని.. అడవి పూవులా ఆ పాత్ర తెరపై చాలా స్వచ్ఛంగా కనిపించింది అని.. ఆ పాత్రలో ఎన్టీఆర్ చాలా గొప్పగా నటించాడు అని మెచ్చుకున్నారు.
ఇక అల్లూరి సీతారామారాజుగా చేసిన చరణ్ మానసిక సంఘర్షణ అనుభవించే పాత్రలో ఒదిగిపోయాడు.. అల్లూరి పాత్రలో వేరియేషన్స్, లేయర్స్ ఎక్కువుగా ఉంటాయి.. ఆ పాత్ర పోషించడం ఈ సినిమాలో చాలా కష్టం.. ఇక సినిమాలో ఎన్టీఆర్.. చరణ్‌ను అన్నా అని పిలుస్తాడు.. చరణ్ పాత్రలో ఆ పరిణిగా బాగా కనిపిస్తుంది.. నిజానికి ఎన్టీఆర్ గొప్ప నటుడిగా తనకు చాలా ఇష్టం.. కానీ ఈ సినిమా వరకు చూసుకుంటే చరన్ పాత్రకే తాను 2 మార్కులు ఎక్కువ వేస్తానని చెప్పాడు.
ఈ సినిమా డైరెక్టర్ జక్కన్న తండ్రి స్వయంగా ఈ మాట చెప్పడంతో పాటు చరన్‌కే రెండు మార్కులు ఎక్కువ వేస్తానని చెప్పడంతో ఇదేంటి మీడాడి ఇంత షాక్ ఇచ్చాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రేపు సినిమా రిలీజ్ అయ్యాక.. ఈ ఇద్దరు హీరోలలో ఎవరి పాత్ర కాస్త ఎక్కువుగా ఉన్నట్టు.. ఎవరి పాత్రకు కాస్త ఎక్కువ ప్రయార్టీ ఉన్నట్టు అనిపించినా పెద్ద రచ్చే ఉంటుంది.