దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు తెలుగు వాళ్లే కాదు.. భారతదేశమే గర్వించదగ్గ గొప్ప దర్శకుడు అయిపోయాడు. అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మారిన రాజమౌళి ఈ 20 ఏళ్లలో అపజయం అన్న మాటే ఎరగలేదు. సినిమా సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు బాహుబలి సినిమాతో మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాడు. రాజమౌళి ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినా.. ఎందరు హీరోలతో చేసినా కూడా తన తొలి సినిమా హీరో ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానంతో ఉంటాడు.
ఇంకా చెప్పాలంటే తన కెరీర్‌లోనే ఎక్కువ సినిమాలు ఎన్టీఆర్‌తోనే చేశాడు. తొలి సినిమా స్టూడెంట్ నెంబర్, రెండో సినిమా సింహాద్రి, ఆ తర్వాత యమదొంగ, ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఇలా నాలుగు సినిమాలు చేశాడు. నిజానికి ఎన్టీఆర్‌ను స్టార్‌ను చేయడంతో పాటు మాస్ ఇమేజ్, యూత్‌లో ఇమేజ్ తేవడంలో ఈ సినిమాలదే కీలక పాత్ర. ఇక రాజమౌళి ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా ఏదో సందర్భంలో ఎన్టీఆర్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది.
ఓ పాత్రకు న్యాయం చేసేందుకు తారక్ ఎంతలా కష్టపడతాడు ? అనే విషయాన్ని రాజమౌళి చాలా సార్లు చాలా గొప్పగా చెప్పాడు. ఇక తారక్ రాజమౌళి ఫేవరెట్ హీరో అన్నది తెలిసిందే. తాజాగా రాధేశ్యామ్ ప్రమోషన్లలో రాజమౌళి ప్రభాస్‌ను ఇంటర్వ్యూ చేశాడు. అప్పుడు కూడా తారక్ ప్రస్తావన వచ్చింది. నీకు నాకంటే కూడా తారక్, చరణ్ అంటేనే ఇష్టమన్న విషయం తనకు అర్థమైందని ప్రభాస్ సరదాగా రాజమౌళిని ఆటపట్టించాడు.
యమదొంగ సినిమా చేసేటప్పుడు కూడా ప్రభాస్ – రాజమౌళి మధ్య చర్చలు జరిగినప్పుడు కూడా రాజమౌళి తారక్ దగ్గర తన కోసం రెండు, మూడు కథలు రెడీగా ఉన్నాయని చెప్పేవారట. మళ్లీ తారక్‌తో తాను చేయబోయే కథ ఇదేనని చెపుతూ ఉండడంతో.. అబ్బా ఈ కథలు అన్నీ అయ్యే సరికి మళ్లీ తనకు ఎప్పుడు జక్కన్నతో చేసే టైం వస్తుందా ? అని ఆలోచనలో పడిపోయేవాడిని అని ప్రభాస్ చెప్పాడు.
ఇక తారక్‌తో ఓ సీన్ చేసి బాగా చేశావ్ తారక్ అనే లోపలే తారకే దుమ్మురేపేశాను కదా అనేస్తాడు… తారక్‌పై తారక్‌కు ఉన్న నమ్మకానికి తనకు ఆశ్చర్యం వేస్తుందని రాజమౌళి చెప్పాడు. ఇక దర్శకుడి కంటే తారక్‌కు తనపై తనకు అపారమైన నమ్మకం ఉంటుందని అది చూస్తే తనకు ముచ్చట వేస్తుందని చెప్పాడు. ఇక తారక్ కూడా రాజమౌళిపై ఎంతో అభిమానంతో ఉంటాడు. ఓ సినిమాను రాజమౌళి శిల్పిం చెక్కినట్టు చెక్కుతాడనే జక్కన్న అని స్వయంగా పేరు పెట్టాడు.