భారతదేశ గొప్ప స్వాతంత్ర ఉద్యమకారులు అయిన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల ఫిక్షనల్ పాత్రలతో భారతదేశ అతి పెద్ద యాక్షన్ డ్రామా తీశాడు రాజమౌళి. ఈ విజువల్ వండర్ ఎలా ? ఉండబోతోందో ఈ నెల 25న చూడబోతున్నాం. ఇది పెద్ద యాక్షన్ సినిమా. అయితే ఈ సినిమాకు సీక్వెట్ ఉంటే ? ఎలా ఉంటుంది ? త్రిబుల్ ఆర్ 2 కూడా ఉంటుందా ? ఇది కామెడీగా ఉంటే ఎలా ఉంటుంది. ఈ విషయాలపై దర్శకధీరుడు రాజమౌళి సంచలన విషయాలు బయట పెట్టారు.
ఈ నెల 25న రిలీజ్ అవుతోన్న త్రిబుల్ ఆర్ ప్రమోషన్లు భారీ ఎత్తున నడుస్తున్నాయి. గత రాత్రి కర్నాకటలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కర్నాకట ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్వయంగా హాజరయ్యారు అంటేనే ఈ సినిమా రేంజ్, క్రేజ్ ఎలా ఉన్నాయో తెలుస్తోంది. ఈ ఈవెంట్‌లో దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ త్రిబుల్ ఆర్‌ను కామెడీగా తీస్తే ఎలా ఉంటుందో ? ఆ వెర్షన్ కూడా సిద్ధంగా ఉందని చెప్పాడు.
ఈ సినిమా షూటింగ్ ఏకంగా మూడేళ్ల పాటు జరిగింది. ప్రతి సీన్‌లో తారక్, చరణ్.. మిగిలిన నటులు నటించేందుకు వారు ఎలా నటిస్తే బాగుంటుందో రాజమౌళి అసిస్టెంట్లు స్వయంగా యాక్ట్ చేసి చూపించేవారట. ఎలా నటించాలో కూడా వాళ్లే డ్యాన్సులు అవి చేసేసి మరీ చూపించేవారట. అయితే ఇవి కామెడీగా ఉంటాయని రాజమౌళి చెప్పాడు. అయితే ఈ సీన్లు కూడా ప్రేక్షకులు చూస్తేనే బాగుంటుందని.. త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యాక.. ఈ సినిమా హడావిడి అయ్యాక ఆ కామెడీ వెర్షన్ సీన్లు కూడా రిలీజ్ చేస్తామని రాజమౌళి తెలిపాడు.
తనకు 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారని.. వాళ్లు లేకపోతే తాను ఈ సినిమా ఇంత బెటర్‌గా తీసి ఉండేవాడినే కాదని.. ప్రతి సీన్ కూడా సెట్స్ మీదకు రాకముందే తామందరం టెస్ట్ షూట్ చేసుకుంటామని.. మా అసిస్టెంట్ డైరెక్టర్లే హీరోలుగా, విలన్లుగా ఆ సీన్లలో నటించేస్తారని రాజమౌళి చెప్పాడు. ఈ సీన్లు చూస్తే మీకు అంతకుమించిన కామెడీ మరొకటి ఉండదని కూడా చెప్పాడు.
ఇక ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తన అసిస్టెంట్ డైరెక్టర్లతో పాటు శాంతినివాసం సీరియల్ టైం నుంచి తనతో ట్రావెల్ చేస్తోన్న వారిని ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుని వారు తన జర్నీలో ఎంతలా సాయం చేస్తున్నాడో మెచ్చుకున్నాడు. ఇక రాజమౌళిని కర్నాటక సీఎం బొమ్మై సైతం ఆకాశానికి ఎత్తేయడంతో పాటు ఈ సినమా భారతదేశ వ్యాప్తంగా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తుందని ఆకాక్షించారు.