దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మామూలుగా అంచనాలు లేవు. బాహుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో అంచనాలు అయితే మామూలుగా లేవు. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. త్రిబుల్ ఆర్ ఏ రేంజ్‌లో రికార్డులు బ్రేక్ చేస్తుందా ? అని ఒక్కటే ఉత్కంఠ ఇప్పుడు ఇండియా వైజ్‌గా నెలకొంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్‌బాబు సినిమా తెరకెక్కించనున్నాడు. ఎప్పుడో సింహాద్రి సినిమా హిట్ అయ్యాక దుర్గా ఆర్ట్స్ అధినేత, సీనియర్ నిర్మాత కేఎల్. నారాయణ రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి కేఎల్. నారాయణకు సినిమా చేసేందుకు మహేష్ వెయిట్ చేస్తూనే వస్తున్నాడు. విచిత్రం ఏంటంటే కొన్నేళ్ల క్రితం అదే కేఎల్. నారాయణ మహేష్‌బాబుకు కూడా అడ్వాన్స్ ఇచ్చారు. అలా ఆ బ్యానర్లో వీరిద్దరి కాంబోలో ఈ సినిమా సెట్ అయ్యింది.
మహేష్‌బాబు అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు సినిమా అభిమానులు కూడా రాజమౌళి – మహేష్ సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఇక రాజమౌళి త్రిబుల్ ఆర్ ప్రమోన్లలో తన నెక్ట్స్ సినిమా మహేష్‌తోనే ఉంటుందని పదే పదే చెపుతూ వస్తున్నాడు. ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కోసం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అదిరిపోయే అడ్వెంచర్ థ్రిల్లర్ స్టోరీ రాసినట్టు కూడా చెప్పారు.
ఇక ఈ సినిమా గురించి వార్తలు వస్తున్న కొద్ది ఈ సినిమాలో బాలకృష్ణ కూడా నటించబోతున్నాడని.. సెకండాఫ్‌లో 40 నిమిషాల పాటు బాలయ్య పాత్ర ఉంటుందని ఒక్కటే ప్రచారం జరిగింది. బాలయ్య కూడా ఉంటే ఇక నందమూరి ఫ్యాన్స్ రచ్చ కూడా మామూలుగా ఉండదని కూడా అనుకున్నారు. అయితే ఈ ప్రచారంపై రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. త్రిబుల్ ఆర్ ప్రమోషన్లలో భాగంగా బెంగళూరు వెళ్లిన రాజమౌళిని అక్కడ లోకల్ విలేకర్లు మహేష్‌బాబు సినిమాలో బాలయ్య ఉన్నారా ? అని ప్రశ్నించారు.
ఈ సినిమాలో బాలయ్య నటిస్తున్నాడన్నది నిజం కాదని.. కేవలం మహేష్ మాత్రమే హీరో అని.. ఇది మల్టీస్టారర్ కాదని చెప్పేశాడు. దీంతో ఈ ప్రచారంపై ఇప్పటి వరకు వచ్చిన వార్తలు అన్నీ పుకార్లే అని తేలిపోయింది. ఏదేమైనా 15 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు మహేష్‌బాబు – రాజమౌళి కాంబోలో సినిమా పట్టాలు ఎక్కుతోంది. ప్రస్తుతం మహేష్ పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట చేస్తున్నాడు.. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా పూర్తి చేసి.. రాజమౌళి సినిమా కోసం జాయిన్ అవుతాడు.