ఆర్.ఆర్.ఆర్ కోసం దాదాపు మూడేళ్లు రాత్రింబవళ్లూ కష్టపడ్డాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈ సినిమా కోసం కేవలం రాజమౌళి మాత్రమే కాదు.. ఆయన కుటుంబం అంతా ఎంతో కష్టపడింది. రాజమౌళి సినిమా అంటేనే ఆయన ఫ్యామిలీ అంతా ఎంత ఎఫర్ట్ పెట్టి పని చేస్తుందో చెప్పక్కర్లేదు. రాజమౌళి సినిమాకు ఎలాగూ ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ ఇస్తారు. ఇక స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు రాజమౌళియే చూస్తారు. ఆయన మరో సోదరుడు కీరవాణి మ్యూజిక్ ఇస్తారు.
ఇక రమా రాజమౌళి, రాజమౌళి వదిన అయిన కీరవాణి భార్య శ్రీ వల్లి, రాజమౌళి కుమారుడు కార్తీకేయ, చివరకు రాజమౌళి కుమార్తె మయూఖ ఇలా ప్రతి ఒక్కరు సినిమాలో తమ వంతుగా ఇన్వాల్ అయిపోతారు. ఈ క్రమంలోనే త్రిబుల్ ఆర్‌కు ఈ మూడేళ్ల పాటు జక్కన్న ఫ్యామిలీ అంతా ప్రాణం పెట్టేసింది. ఆ ఫ్యామిలీ ప్రతి సినిమాకు ఇంతే కష్టపడుతుంది. ఇక తన సినిమా రిలీజ్‌కు ముందు ఎన్నో ఏళ్లుగా.. నెలలుగా ఎంతో కష్టపడే రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యాక ఇక్కడ ఉండడు. తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిపోయి అక్కడ కొద్ది రోజుల పాటు విహార యాత్రకు వెళుతూ ఉంటాడు.
ఈ క్రమంలోనే ఇప్పుడు త్రిబుల్ ఆర్ కోసం మూడేళ్లుగా పడిన కష్టం రిజల్ట్ రూపంలో వచ్చేసింది. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా కూడా త్రిబుల్ ఆర్ ఎంత హిట్ అనేది ఆ సినిమా వసూళ్లే మాట్లాడతాయి. ఇక ఇప్పుడు కాస్త రిలాక్స్ కోసం కుటుంబంతో కలిసి 15 రోజులు విదేశీ టూర్‌కు వెళుతున్నట్టు తెలుస్తోంది. అప్పటకి త్రిబుల్ ఆర్ హవా కాస్త చల్లబడుతుంది. విహార యాత్ర నుంచి తిరిగి వచ్చి ఒకటి రెండు నెలలు గ్యాప్ తీసుకున్న వెంటనే మహేష్‌బాబు సినిమా కోసం వర్క్ స్టార్ట్ చేస్తాడు.
ఇక మహేష్‌బాబు సినిమా ఏంటనేదానిపై రాజమౌళికి ఇప్పటికే ఓ లైన్ ఉంది. కథ రెడీ అయిపోయింది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతోందని స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చెప్పేశారు. ఇక త్రిబుల్ ఆర్‌ను మించి ఈ సినిమా ఉంటుందని కూడా రాజమౌళి చెప్పేశారు.
రాజమౌళి ఇప్పటి వరకు ఎంచుకున్న లైన్లకు, కథలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇప్పటి వరకు ఇది మల్టీస్టారర్ సినిమా అని.. ఇందులో నటసింహం బాలయ్య కూడా ఓ 40 నిమిషాల పాత్రలో కనిపించబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. దీనిని రాజమౌళి ఖండిచాడు కూడా..! ప్రస్తుతం మహేష్ సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు. ఆ తర్వత త్రివిక్రమ్ సినిమా పూర్తి చేసి వెంటనే రాజమౌళి సినిమాలో జాయిన్ అవుతాడు.