Movies' రాధేశ్యామ్ ' ప్రీమియ‌ర్ షో టాక్‌... అంచ‌నాలు త‌ల్ల‌కిందులయ్యాయ్‌...!

‘ రాధేశ్యామ్ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… అంచ‌నాలు త‌ల్ల‌కిందులయ్యాయ్‌…!

బాహుబ‌లి, సాహో త‌ర్వాత రాజ‌మౌళి న‌టించిన సినిమా రాధేశ్యామ్‌. త‌న పాన్ ఇండియా ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తూ ప్ర‌భాస్ న‌టించిన ఈ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల‌ను ఈ సినిమా అందుకుందా ? లేదా ? అన్న‌ది చూస్తే… ఫ‌స్టాఫ్ చాలా స్టైలీష్‌గా, క‌ళాత్మ‌కంగా… విజువ‌ల్స్ ప‌రంగా అద్భుతంగా ఉంది.

సెకండాఫ్ స్లోగా ఉండ‌డంతో పాటు క‌థ అష్ట‌వంక‌ర‌లు తిరుగుతూ ఉంటుంది. మ‌న‌స్సుకు ఆహ్లాదం క‌లిగించే సంగీతం, గ్రాండ్ విజువ‌ల్స్‌, ప్ర‌భాస్ – పూజా కెమిస్ట్రీ బాగున్నాయి. పాట‌ల‌తో పాటు నేప‌థ్య సంగీతం, ఆర్ట్ వ‌ర్క్ ఇవ‌న్నీ మ‌న‌ల‌ను మైమ‌రిపిస్తాయి. అయితే సినిమా క‌థ‌, ప్ర‌భాస్ క్యారెక్ట‌రైజేష‌న్‌, చివ‌ర‌కు పాత్ర‌లో అత‌డు న‌టించిన తీరు అత‌డి ఇమేజ్‌కు ఏ మాత్రం సూట్ కాలేదు.

కొన్ని స‌మ‌యాల్లో విక‌మాదిత్య‌గా అత‌డు ఇబ్బంది ప‌డిన‌ట్టుగా కూడా అనిపించింది. ప్రేర‌ణ‌గా పూజ హెగ్డే చాలా అందంగా కనిపించింది. 1976 ఇట‌లీ నేప‌థ్యంలో సాగిన క‌థ‌లో అక్క‌డ‌కు వెళ్లిన భార‌త‌దేశ అగ్ర‌పామిస్ట్ విక్ర‌మాదిత్య అక్క‌డ ప్రేర‌ణ‌తో ఎలా ప్రేమ‌లో ప‌డ్డాడు ? వారి జీవితంతో విధి ఎలా ఆటాడుకుంద‌న్న నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంది. గ్రాండ్ విజువ‌ల్స్‌, ఆర్ట్ వ‌ర్క్‌, మ్యూజిక్ వ‌దిలిస్తే సినిమాలో చాలా మైన‌స్‌లే ఉన్నాయి.

ప్ర‌భాస్ ఇమేజ్‌కు సూట్ కాని క‌థ‌, స్లోగా సాగిన క‌థ‌నం, వ‌ర్క‌వుట్ కానీ కామెడీ, సాగ‌దీత‌తో ఉన్న స‌న్నివేశాలు ఇవ‌న్నీ సినిమాకు పెద్ద మైన‌స్‌. చాలా చోట్ల సినిమా ప్రేక్ష‌కుల స‌హ‌నం ప‌రీక్షిస్తుంది. క్లైమాక్స్ కూడా బ‌ల‌వంతంగా ఇరికించిన‌ట్టుగా ఉంది. ఓవ‌రాల్‌గా అయితే సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకోలేద‌న్న రిపోర్టులే ఎక్కువుగా వ‌స్తున్నాయి. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news