ప్రస్తుతం తెలుగు సినిమా సర్కిల్స్‌లో మాత్రమే కాకుండా.. సౌత్ టు నార్త్.. అటు ఓవర్సీస్, ఇటు దుబాయ్, అబూదాబీ ఇలా ఎక్కడ చూసినా కూడా రాధేశ్యామ్ గురించే చర్చ నడుస్తోంది. గత అర్ధరాత్రి నుంచే థియేటర్ల దగ్గర ప్రభాస్ అభిమానులు జై ప్రభాస్.. జై రెబల్‌స్టార్ అంటూ నినాదాలు చేస్తూ హంగామా స్టార్ట్ చేశారు. ఇక థియేటర్ల ముందు ప్రీమియర్ షో పడడానికి ముందే తీన్‌మార్ డప్పులు, కేకలు, డ్యాన్సులతో మామూలు హంగామా లేదు. మూడేళ్ల తర్వాత ప్రభాస్‌ను వెండితెరపై చూడడంతో అభిమానుల ఆ ఉత్సాహమే వేరు అన్నట్టుగా ఉంది.
ఇక సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభాస్ – పూజ కెమిస్ట్రీ గురించే మాట్లాడుకుంటున్నారు. లవ్ సీన్స్‌తో ఇద్దరూ ఇరగదీసేశారని.. పూజ తన అందంతో కట్టిపడేసిందని అంటున్నారు. సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే మనం థియేటర్లోనే వేరే ప్రపంచంలోకి వెళ్లినట్టుగా ఉంటుందని అంటున్నారు. ఇక సినిమా మేకింగ్, లుక్స్ పరంగా బాగున్నా కథ, కథనాల విషయానికి వస్తే మాత్రం అంచనాలు అందుకోలేదనే అంటున్నారు.
యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్‌కు తగిన సినిమా కాదన్న కామెంట్లే ఎక్కువుగా వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ స్థాయి సినిమా కాదన్న విషయాన్ని కుండబద్దలు కొడుతున్నారు. ఎవ్వరూ ఊహించని లవ్‌స్టోరీతో మనముందుకు వస్తున్నట్టు ప్రభాస్ చెప్పినా ప్రభాస్ కెరీర్‌కు ఉపయోగపడే సినిమా కాదని.. ప్రభాస్‌కు తన స్థాయికి తగిన పేరు కూడా తీసుకురాకపోవచ్చన్న కామెంట్లే ఎక్కువుగా ఓవర్సీస్ నుంచి వస్తున్నాయి.
ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకే హైలెట్ అని ముందు నుంచి చెపుతూ వచ్చారు. అయితే వాస్తవంగా అది చాలా మందికి అర్థమే కాలేదట. ఓవరాల్‌గా దర్శకుడు రాధాకృష్ణ ఇన్ని వనరులు ఉన్నప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుని సినిమాను ఇంకాస్త బెటర్‌గా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఓవరాల్‌గా చెప్పాలంటే రాధేశ్యామ్ జస్ట్ ఓకే. అలా అని బాహుబలిలో సూపర్ టాక్‌తో చరిత్రలు రాసే సీన్ లేదని.. పోనీ సాహోలా మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా హిట్ అయ్యే స్కోప్ లేదని తేల్చేస్తున్నారు.
ఇక సినిమాపై భారీ అంచనాలతో సినిమాకు వెళ్లిన వారు అక్కడ పెదవి విరుస్తున్నారు. కొందరు మీమ్స్‌తో రాధేశ్యామ్‌ను ఆడుకుంటున్నారు. కొందరు అయితే బాలయ్య సినిమా డైలాగ్ వాడుకుంటూ సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటని ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా రాధేశ్యామ్ అంచనాలు అందుకోలేదన్నదే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అయితే క్లాస్ పీపుల్ ఆదరిస్తే మాత్రం ఇబ్బంది ఉండదు.