పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన భారీ సినిమా రాధేశ్యామ్. మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుని ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 7 వేల స్క్రీన్లలో రిలీజ్ అయ్యింది. జిల్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సీరిస్ సంయుక్తంగా నిర్మించాయి. దాదాపుగా వడ్డీలతో కలుపుకుంటే రు. 300 కోట్ల బడ్జెట్ ఈ సినిమాకు అయ్యింది.
బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్, సాహో సినిమాల తర్వాత ప్రభాస్ ఈ సినిమా చేశాడు. ఇటలీ నేపథ్యంలో పామిస్ట్రీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు చూశాక భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాలో మాస్ ఎలిమెంట్స్ తక్కువుగా ఉండడంతో అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. డే వన్ ఫిగర్ పరంగా కొన్ని చోట్ల మాంచి వసూళ్లు కొల్లగొట్టింది.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం యూఎస్‌లో అయితే ఈ సినిమా ప్రీమియర్స్ టైంకే ఏకంగా 8 లక్షల డాలర్స్‌కు పైగా అందుకుంటుందని అంచనాలు వేసుకున్నారు. అయితే ఫైనల్‌గా చూస్తే ఇది ఏకంగా 9 లక్షల 4 వేల డాలర్స్ మార్క్ క్రాస్ అయ్యింది. అంటే దాదాపుగా ప్రీమియర్స్ ద్వారానే 1 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఈ యేడాది రిలీజ్ అయిన సినిమాలలో హయ్యస్ట్ ప్రీమియర్స్ వసూళ్లు సాధించిన చిత్రంగా రాధేశ్యామ్ రికార్డులకు ఎక్కింది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు తొలి రోజు రు. 30 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఏరియాల వారీగా పూర్తి ఫిగర్స్ రావాల్సి ఉంది. హైదారాబాద్ సిటీలో మాత్రమే ఒక్క షో పడకుండా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఏకంగా రు 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రు. 202 . 80 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.