యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా – పూజాహెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాను యూవీ వాళ్లు. టీ సీరిస్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. మార్చి 11న భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ బాహుబలి సీరిస్ సినిమాలు, సాహో తర్వాత వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచింది.
ఫస్ట్ వీకెండ్ వరకు బాక్సాఫీస్ దగ్గర నిలబడినా.. ఆ తర్వాత కలెక్షన్లు పూర్తిగా తేలిపోయాయి. దీనికి తోడు కశ్మీర్ ఫైల్స్ సినిమా ఎఫెక్ట్ కూడా రాధేశ్యామ్‌పై గట్టిగా పడింది. అసలు ఈ సినిమా కథ ప్రభాస్ ఇమేజ్‌కు ఏ మాత్రం సూట్ కాలేదు. దీంతో రాధేశ్యామ్ ప్రభాస్ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఓ సారి రాధేశ్యామ్ వరల్డ్ వైడ్ ఫైనల్ కలెక్షన్లు చూస్తే ఇలా ఉన్నాయి.
నైజాం – 24.80 కోట్లు
సీడెడ్ – 7.46 కోట్లు
ఉత్తరాంధ్ర – 4.90 కోట్లు
గుంటూరు – 4.50 కోట్లు
ఈస్ట్ – 4.34 కోట్లు
వెస్ట్ – 3.32 కోట్లు
కృష్ణ – 2.71 కోట్లు
నెల్లూరు – 2.14 కోట్లు
————————————————————
ఏపీ+తెలంగాణ = 54.17 కోట్లు (84.60కోట్ల గ్రాస్)
————————————————————
తమిళనాడు = 0.76 కోట్లు
కేరళ = 0.18 కోట్లు
కర్ణాటక = 4.20 కోట్లు
హిందీ = 10.70 కోట్లు
ఓవర్సీస్ = 11.42 కోట్లు
————————————————————–
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ = 83.12 కోట్లు (151కోట్ల గ్రాస్)
————————————————————-
పేరుకు మాత్రమే ఇవి పెద్ద ఫిగర్స్‌గా కనపడుతున్నా.. ప్రభాస్ ఇమేజ్‌కు ఏ మాత్రం సరితూగేవి కావు. పైగా ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.208 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రు. 210 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫైనల్‌గా రు 83.12 కోట్ల షేర్ సాధించింది. అంటే ఓవరాల్గా ఈ సినిమా రు. 126 కోట్ల భారీ నష్టంతో సినిమా కొన్న బయ్యర్లను నిండా ముంచేసింది. ప్రభాస్ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్గా నిలవడంతో పాటు భారతదేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా అతి చెత్త రికార్డు నమోదు చేసింది.