యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా – పూజాహెగ్డే హీరోయిన్‌గా జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్. ప్రభాస్ నటించిన సాహో సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలతో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. పైగా ప్రభాస్‌ను చూసి మూడు సంవత్సరాలు దాటేసింది. ఎలాగైనా ఈ సినిమాను ఫస్ట్ డే.. వీలుంటే ఫస్ట్ షో చూసేయాలని ప్రభాస్ అభిమానులు అందరూ రెడీ అయిపోయారు.
పామిస్ట్రీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అన్న ప్రచారంతో పాటు నార్త్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయడం.. అటు ఓవర్సీస్‌లో కళ్లు చెదిరే అడ్వాన్స్ బుకింగ్‌లు, టీజర్లు, ట్రైలర్లు ఇవన్నీ సినిమాను ఫస్ట్ డే చూసేలా ఉత్సాహం పెంచాయి. పామిస్ట్రీ నేపథ్యం, ప్రేమకథ, పైగా 1970వ దశకంలో జరిగిన పీరియాడికల్ స్టోరీ ఇవన్నీ సినిమాపై అంచనాలు మామూలుగా పెంచలేదు. యూవీ క్రియేషన్స్ వాళ్లు, జీ స్టూడియోస్ కలిసి నిర్మించిన ఈ సినిమా కోసం గత అర్ధరాత్రి నుంచే ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర సందడి చేశారు.
ఈ క్రమంలోనే ఓవర్సీస్‌లో షో పడకుండానే ఏకంగా 600 డాలర్లతో సంచలన రికార్డు నమోదు చేసిన రాధేశ్యామ్ ఇక్కడ నైజాంలో కూడా షో పడకుండానే అదిరే రికార్డు.. ఇంకా చెప్పాలంటే ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుంది. కేవలం ప్రీ రిలీజ్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా రు 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ఇది ఆల్ టైం డే 1 రికార్డ్ అని చెప్పాలి.
ఇక ఓవరాల్‌గా చూస్తే ఫస్ట్ డే కంప్లీట్ అయ్యే సరికే నైజాంలో రాధేశ్యామ్ రు. 12 – 15 కోట్లకు పైనే వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పైగా అక్కడ ఇప్పటికే టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉంది. కావాల్సినన్ని స్క్రీన్లు కూడా వేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకు కూడా అనుమతులు ఇచ్చేసింది. ఇవన్నీ సినిమాను మరిన్ని రికార్డుల వైపు నడిపిస్తున్నాయి. మరి ప్రభాస్ ఏం చేస్తాడో ? చూడాలి.