యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ నటించిన సాహో సినిమా తర్వాత మూడేళ్లకు పైగా లాంగ్ గ్యాప్ తో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు, క్రిటిక్స్ మాత్రమే కాదు.. సగటు అభిమాని కూడా నిరాశ పడ్డాడు.
ప్రభాస్ ఇమేజ్‌కు సూట్ అయ్యే కథ ఇది కాదని ఆయన అభిమానుల్లో కొందరు నిరుత్సాహ పడ్డారు. అయితే తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రు. 71 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా మూడు రోజులకు రు. 151 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ఈ యేడాది రిలీజ్ అయిన సినిమాల్లో కేవలం 3 రోజుల్లోనే ఈ రేంజ్‌లో వసూళ్లు రాబట్టిన సినిమాగా రాధేశ్యామ్ రికార్డులకు ఎక్కింది.
మూడు రోజులకు వరల్డ్ వైడ్‌గా రు. 151 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక షేర్ పరంగా చూస్తే మూడు రోజులకు ఏపీ, తెలంగాణలో రు 46. 47 కోట్ల షేర్, వరల్డ్ వైడ్‌గా రు. 70 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఈ సినిమాకు రు. 202 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు రు. 70 కోట్ల షేర్ అంటే ఇంకా బాక్సాఫీస్ దగ్గర రాబట్టాల్సిన షేర్ చాలానే ఉంది. మరి ప్రభాస్ ఏం చేస్తాడో ? చూడాలి.
నైజాం : 20.5Cr
సీడెడ్: 6.76Cr
ఉత్తరాంధ్ర : 4.2Cr
గుంటూరు : 4.04Cr
ఈస్ట్ : 3.8Cr
వెస్ట్ : 3Cr
కృష్ణా : 2.35Cr
నెల్లూరు : 1.82Cr
—————————————–
ఏపీ + తెలంగాణ = 46.47Cr Share
—————————————–
కర్నాటక: 6.6Cr
తమిళనాడు : 0.6Cr
కేరళ : 0.15Cr
రెస్టాఫ్ ఇండియా : 6.4Cr
ఓవర్సీస్ : 10.5 Cr
———————————————-
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 70.72Cr Share
———————————————-