యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు తెలంగాణలో కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు అయితే ముందుగా పడిపోయాయి. ఎన్నో అంచనాలతో రు. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు మూడు సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ వచ్చారు. ఓవరాల్‌గా సినిమా అంచనాలు అందుకోలేదన్న టాక్ అయితే ఎక్కువుగా వినిపిస్తోంది.
ఈ సినిమా కథ ప్రభాస్ ఇమేజ్‌కు పెద్దగా సూట్ కాలేదనే ఎక్కువ మంది అంటోన్న మాట. సినిమాలో విజువల్స్ అయితే బాగున్నాయి. క్వాలిటీగా ఉంది. కథలో కన్‌ఫ్యూజన్‌కు తోడు, స్లో నెరేషన్ కూడా ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెట్టింది. పామిస్ట్రీకు ప్రేమకథను జోడించిన దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ప్రేమకు, విధికి ఉన్న లింక్‌ను ఆసక్తిగా మలచలేకపోయాడని టాక్ ?
పాటలు వరకు మంత్రముగ్ధంగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం సూపర్. కావాల్సినంత ఖర్చు.. పైగా బాహుబలి, సాహో తర్వాత అద్భుతమైన పాన్ ఇండియా ఇమేజ్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న హీరో ప్రభాస్.. ఇలా అన్ని ఉన్నా కూడా కథా పరంగా సరైన జడ్జ్‌మెంట్ చేయలేకపోయారని కొందరు చెపుతున్నారు. అయితే సినిమా సాగిన తీరు, ఈ ప్రేమకథ క్లాస్ ఆడియెన్స్‌కు, యూత్‌కు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
భారీ ఖర్చుతో పాటు మూడేళ్ల తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఓ సారి వరకు చూడవచ్చనే అంటున్నారు. అయితే రు. 300 కోట్లు పారపోసిన ఈ సినిమా ఆ స్థాయిలో వసూళ్లు రాబడుతుందా ? లేదా ? అన్నది మాత్రం ప్రస్తుతానికి సందేహమే. మరి సాహోలో ప్లాప్ టాక్ వచ్చినా ప్రభాస్ తన మానియాతో ఏదైనా సంచలనం చేస్తాడా ? అన్నది చూడాలి.