యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్. ప్రభాస్ బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమా వచ్చింది. సాహో కూడా ప్లాప్ టాక్ వచ్చినా అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోయింది. సాహో బాలీవుడ్‌లో కూడా రు. 150 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది అంటే ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో అర్థమవుతోంది. ఇక ఇప్పుడు ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్‌కు మరో వారం రోజులు టైం మాత్రమే ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ కోసం ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైట్మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు.
సంక్రాంతి కానుకగా రావాల్సిన ఈ సినిమా వాయిదా పడి ఎట్టకేలకు ఈ నెల 11న థియేటర్లలోకి వస్తోంది. సౌత్‌లో అన్ని భాషలతో పాటు అటు బాలీవుడ్‌లోనూ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో భారీ ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.
వాస్తవంగా జాతకాలు, ప్రేమకథ, 1960వ దశకం నాటి కథ, యూరప్ స్టోరీ ఇవన్నీ మిక్స్ అయిన స్టోరీ కావడంతో ఈ సినిమా రన్ టైం దాదాపు మూడు గంటల పాటు ఉంటుందని ప్రచారం జరిగింది. రన్ టైం ఎక్కువ ఉంటే ఇబ్బంది అవుతుందన్న సందేహాలు వచ్చాయి. అయితే ఈ పుకార్లకు సెన్సార్ రిపోర్ట్ తర్వాత చెక్ పడింది. రాధే శ్యామ్ రన్ టైం 2.18 గంటలు మాత్రమే. ఇంత తక్కువ రన్ టైం అంటే సినిమాను చాలా క్రిస్పీగా కట్ చేశారు.
దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఈ సినిమా సెట్స్ మీదే ఉంది. జిల్ లాంటి ఒకే ఒక్క యావరేజ్ సినిమాకు దర్శకత్వం వహించిన రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. యూవీ క్రియేషన్స్ – గోపీ కృష్ణా మూవీస్ సంయుక్తంగా దాదాపుగా రు. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లు, పోస్టర్లు సినిమాకు మంచి బజ్ తీసుకువచ్చాయి.
ఇటలీ అందాలు, భారీ సెట్లు, పాత కాలపు ఆర్ట్ వర్కింగ్, వింటేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో ప్రభాస్-పూజాహెగ్డే రొమాంటిక్ సీన్లు సినిమాకే హైలెట్ అంటున్నారు. ఒకే సినిమాకు ఐదారుగురు సంగీత దర్శకులు పనిచేయడం టాలీవుడ్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. మరి ప్రభాస్ పాన్ ఇండియా ఫామ్‌ను రాధే శ్యామ్ కంటిన్యూ చేస్తుందో ? లేదో ? చూడాలి.