దివంగత కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్. కొద్ది నెలల క్రితం జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ పునీత్ గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు. అసలు పునీత్ మరణాన్ని ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేదు. కేవలం కన్నడ ఇండస్ట్రీయే కాదు.. భారత సినీ ప్రేమికులు అందరూ కూడా పునీత్ మరణం పట్ల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చివరకు కర్నాటక ముఖ్యమంత్రి పునీత్ అంత్యక్రియలకు ముందు పునీత్ మృతదేహం నుదిటిపై ముద్దుపెట్టారంటేనే పునీత్‌కు సినిమాయేతర రంగాల్లో కూడా ఎలాంటి అభిమానులు ఉన్నారో అర్థమవుతోంది.
కన్నడ జనాలు అయితు పునీత్ మరణం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇక పునీత్ నటించిన చివరి చిత్రం జేమ్స్. పునీత్ జయంతి కానుకగా నిన్న ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో 4 వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. పునీత్‌పై ఉన్న అభిమానంతో వారం రోజుల పాటు కర్నాకటలో ఉన్న అన్ని థియేటర్లలోనూ జేమ్స్ సినిమాను మాత్రమే ప్రదర్శించాలని డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఒకే నిర్ణయానికి వచ్చారు.
కన్నడంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అన్న టాక్ వచ్చింది. కథ కాస్త రొటీన్‌గానే ఉన్నా పునీత్ స్టైలీష్ యాక్టింగ్‌కు ఆయన అభిమానులే కాకుండా.. కన్నడ జనాలు ఫిదా అయిపోయారు. పునీత్ అభిమానులతో పాటు కన్నడ సినీ జనాలు, సాధారణ జనాలు కూడా ఎంతో ఎమోషనల్‌గా తీసుకున్న ఈ సినిమాను కన్నడ సినిమా ఇండస్ట్రీఓలనే ఓ రికార్డు ఓపెనర్‌గా నిలబెట్టారు.
నిన్న గురువారం రిలీజ్ అయిన ఈ సినిమాకు ఉదయం నుంచే బెనిఫిట్ షోలు పడిపోయాయి. నిన్న కన్నడ నాట అంతా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరిగింది. పునీత్ సరసన ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటించింది. బుకింగ్స్‌లోనే దుమ్ము రేపిన ఈ సినిమా ఫస్ట్ డే ఏకంగా కన్నడ నాట రు 26.8 కోట్ల గ్రాస్ వసూలు చేసి పాత రికార్డులు దాటేసి భారీ మార్జిన్‌తో కన్నడ ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డు సెట్ చేసింది.
ఇది పునీత్‌కు గ్రేట్ ట్రిబ్యూట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో మన తెలుగు సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించాడు. దర్శకుడు చేతన్ కుమార్ రొటీన్ కథే తీసుకున్నా. ట్రీట్‌మెంట్ మాత్రం కొత్తగానే ఉంది. పునీత్ తన అభిమానులకు నచ్చే విధంగానే యాక్షన్ సీన్లతో అదరగొట్టేశాడు.