బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ..టూ హాట్ అందాలతో ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ మెల్ల్గ మెల్ల మెల్లగా హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. ప్రియాంకా ఏది చేసిన వెరైటీ గా చేయాలి అనుకుంటుందేమో ..అందుకే తనకంటే వయసులో చాలా చిన్న వాడైన నిక్ జోనాస్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళ జంట ఎప్పుడు బయట కనిపించిన రొమాంటిక్ ఫోజులతో అదరగొడుతుంటారు.
ఈ మధ్యనే ప్రియాంక తన భర్త నిక్ కు విడాలుకు ఇవ్వడానికి సిద్ధపడ్దిందని..అందుకే ఆమె తన భర్త పేరుని అకౌంట్ నుండి తొలగించిందని నెట్టింట వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ప్రియాంకా అమ్మగారు మ్యాటర్ లోకి ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరు బాగున్నారు దయ చేసి తప్పుడు వార్తలు రాయకండి అంటూ వాళ్ల బంధం పై క్లారిటీ ఇచ్చింది. ఇక ఫైనల్ గా ప్రియాంకా కూడా ఇలాంటి వార్తల పై రియాక్ట్ అవుతూ..నా అకౌంట్ పేరు నేను మార్చుకున్నా..దీనికి ఇంత సీన్ అవసరమా..అంటూ ఘాటుగానే జవాబు ఇచ్చింది.
అయితే, రీసెంట్ గా ఈ జంట మళ్లి నెట్టింట నవ్వుల పాలు అవుతున్నారు. నిన్న దేశవ్యాప్తంగా హోలీ పండుగను గ్రాండ్ గా జరుపుకున్నారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా..ఈ పండుగను తమ కుటుంబీకులతో ఫ్రెండ్స్ తో జరుపుకున్నారు. అయితే, ప్రతి ఏడాది హోలీ పండగను ముంబైలో జరుపునే ప్రియాంకా,,ఈసారి మాత్రం లాస్ ఏంజిల్స్‌లోని తమ ఇంట్లో హోలీ పండుగను సింపుల్ గాసెలబ్రేట్ చేసుకున్నారు. ఫుల్ ఖుషీగా రంగులు అద్దుకుంటూ హంగామా చేశారు. దానికి తాలుకా ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంకా పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో భార్యభర్తలు ఇద్దరూ ముద్దు పెట్టుకుంటున్నట్లు ఉంది. దీంతో ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.