సౌత్ ఇండియాలోనే భయంకరమైన మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈ వయస్సులోనూ బాలయ్య మాస్ నటన చూస్తుంటే అరివీర భయంకరంగా ఉంటుంది. అసలు అఖండ సినిమాలో సెకండాఫ్‌లో బాలయ్య నట విశ్వరూపం చూస్తుంటే మెస్మరైజ్ అయిపోవడంతో పాటు అసలు తెరమీద బాలయ్య జీవించేశాడా అనిపించేలా ఉంది. బాలయ్య అఖండ కేవలం తెలుగు గడ్డ మీదే కాదు.. అటు ఓవర్సీస్‌లోనూ.. ఇటు కర్నాకటలో కూడా బాగా ఆడింది. కర్నాటకలో బాలయ్యకు మంచి క్రేజ్ ఉంది. కర్నాటకలో మన తెలుగు సినిమాలు చాలా వరకు బాగానే ఆడుతుంటాయ్.. అయితే అక్కడ కొన్నేళ్ల క్రితం ఇక్కడ నుంచి వెళ్లి స్థిరపడిన తెలుగు వాళ్లు ఎక్కువ. వీళ్లలో సీనియర్ ఎన్టీఆర్ టైం నుంచి ఉన్న అభిమానులు అలా ఆ ఫ్యామిలీకి కంటిన్యూ అవుతున్నారు.
అందుకే బెంగళూరు, రాయచూర్, బళ్లారి, చిత్రదుర్గ, సింధనూర్ ఇలా కొన్ని జిల్లాల్లోనే తెలుగు వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. అందుకే అక్కడ బాలయ్య సినిమాలు బాగా ఆడతాయి. బాలయ్యకు సరైన కథ, డైరెక్టర్ పడితే పాన్ ఇండియా సినిమా తీయడానికి పెద్ద అభ్యంతరాలు ఉండవు. ఇక కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ డైరెక్టర్ అయిపోయాడు. వచ్చే ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 వస్తోంది. ఆ తర్వాత ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ 1, 2 పార్టులు కూడా రెడీ అవుతున్నాయి.
అదే మాస్‌తో పూనకాలు తెప్పించే బాలయ్యకు తోడుగా మాస్ నాడి తెలిసిన అరివీర భయంకరమైన డైరెక్టర్‌గా పేరున్న ప్రశాంత్ నీల్ ఉంటే ఆ కాంబినేషన్ అరాచకం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. బాలయ్య – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందన్నది చెప్పలేం కాని.. మైత్రీ మూవీస్ వాళ్లు ఈ కాంబినేషన్ సెట్ చేసేందుకు ట్రైల్స్ వేస్తున్నారు. మైత్రీ వాళ్లకు కర్నాటకలో మంచి గ్రిప్ ఉంది. ప్రశాంత్ నీల్‌తో సంబంధాలు ఉన్నాయి.
ఇప్పటికే ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ చేసేందుకు మైత్రీ వాళ్లు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీనికి కొన్నాళ్లుగా చర్చలు నలుగుతున్నాయి. మాటలు నడుస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన అయితే ఏదీ రాలేదు. ప్రస్తుతం ఇదే మైత్రీ బ్యానర్లో బాలయ్య 107 ప్రాజెక్ట్ వస్తోంది. మలినేని గోపీచంద్ ఈ సినిమా డైరెక్టర్. ప్రస్తుతం ఎలాగూ బాలయ్యతో సినిమా చేస్తున్నారు. ఇదే క్రమంలో బాలయ్య – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సెట్ చేసేందుకు మైత్రీ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో ? చూడాలి. ఈ మాసివ్ కాంబినేషన్ సెట్ అయితే బాలయ్య కెరీర్‌లో మంచి పాన్ ఇండియా సినిమా అవుతుంది. మంచి కథ పడితే ఈ సినిమా రేంజ్, బాలయ్య రేంజ్ వేరేగా ఉంటాయి. మరి అది ఎప్పటకి జరుగుతుందో ? ఈ లోగా ఎన్ని ఈక్వేషన్లు మారతాయో ? చూడాలి.