ఏదేతేనేం రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్‌కు మరోసారి ప్రభాస్ బలైపోయాడు. ఇది కాకతాళీయమా ? లేదా ? ఇది నిజమైన సెంటిమెంటా ? అన్నది పక్కన పెడితే.. మరోసారి మాత్రం రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్ రాధేశ్యామ్‌పై బలంగా పడింది. రాజమౌళి దర్శకత్వంలో ఏ హీరో అయినా ఓ సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే సదరు హీరో కెరీర్‌లో ఆ సినిమా తిరుగులేని బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఆ హీరోకు రాజమౌళి సినిమా మాంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది.
అంతే అక్కడ నుంచి ఆ హీరోకు వరుస ప్లాపులు పడతాయి. స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత ఎన్టీఆర్‌కు ప్లాపులు.. సింహాద్రి తర్వాత ఆంధ్రావాలా డిజాస్టర్. విక్రమార్కుడు తర్వాత రవితేజకు, ఛత్రపతి తర్వాత ప్రభాస్‌కు, యమదొంగ తర్వాత ఎన్టీఆర్‌కు, సై తర్వాత నితిన్‌కు, మగధీర తర్వాత ఆరెంజ్‌తో రామ్‌చరణ్‌కు, మర్యాద రామన్న తర్వాత సునీల్‌కు ఇలా ఏ హీరోకు అయినా రాజమౌళితో సినిమా చేస్తే వెంటనే రెండు, మూడు డిజాస్టర్లు రావడం మామూలు అయిపోయింది.
రాజమౌళి సినిమా ఎంత హిట్ అయ్యిందో అదే అంచనాలతో ఆ హీరో తర్వాత సినిమాలను కూడా చూడడం కామన్ అయిపోయింది. రాజమౌళితో సినిమా పడి సూపర్ హిట్ కొట్టాక.. ఆ హీరో మళ్లీ సూపర్ హిట్ కొట్టాలంటే కనీసం రెండు, మూడు ప్లాపులు పడాల్సిందే. అయితే ఇప్పుడు ప్రభాస్ కూడా అదే నెగిటివ్ సెంటిమెంట్‌కు రాధేశ్యామ్‌తో మరోసారి బలయ్యాడన్న ట్రోల్స్ నడుస్తున్నాయి.
బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలతో ప్రభాస్ రేంజ్‌ను రాజమౌళి అమాంతం పెంచేశాడు. అసలు తెలుగు హీరోగా ఉన్న ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మాత్రమే కాకుండా.. ప్రపంచంలోనే చాలా దేశాల్లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే బాహుబలి తర్వాత రాజమౌళికి ఉన్న నెగిటివ్ సెంటిమెంట్ సాహో విషయంలో రిపీట్ అయ్యింది. సాహో తెలుగులో బాగా ఆడలేదు. అయితే నార్త్‌లో మంచి వసూళ్లు రావడంతో ఏదోలా గట్టెక్కేసింది.
అయితే ఇప్పుడు రాధేశ్యామ్ కూడా నెగిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద జర్నీ స్టార్ట్ చేసింది. నార్త్‌లో అయితే సాహోకు సూపర్ టాక్ వచ్చింది. కానీ రాధేశ్యామ్‌కు ఆ పరిస్థితి లేదు. మరి ఏదైనా అద్భుతం జరిగితే తప్పా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు లేవు. ఏదేమైనా రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్ మరోసారి ఫ్రూవ్ అయ్యింది.