పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ థియేటర్లలోకి వచ్చేందుకు కొద్ది గంటల టైం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా రాధేశ్యామ్ టెన్షనే నెలకొంది. సాహో తర్వాత ప్రభాస్ నటించిన సినిమా.. భారీ బడ్జెట్.. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడు.. ప్రేమకథ అంటున్నారు.. ప్రేమకథ మీద ఇంత భారీ బడ్జెట్ వర్కవుట్ అవుతుందా ? ఇలా రకరకాల టెన్షన్లు ఇప్పుడు ప్రభాస్ అభిమానులనే కాకుండా అందరి మదిని తొలచి వేస్తున్నాయి.
అసలు ప్రభాస్ రాధేశ్యామ్ మీద ఎంత బడ్జెట్ పెట్టారు. ఎంత వస్తే సినిమా హిట్ అవుతుంది.. ఈ లెక్కలు ఏంటన్నది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారాయి. బాహుబలి – 1 రు. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబడితే వామ్మో అన్నారు. బాహుబలి 2 అయితే ఏకంగా రు. 2 వేల కోట్ల వసూళ్లతో చాలా మంది నోరు తెరచి మూయలేనంత ఆశ్చర్యానికి లోనయ్యేలా సంచలనాలు క్రియేట్ చేసింది.
ఇక సాహోకు కూడా యూవీ వాళ్లు భారీ బడ్జెట్ ఎక్కించేశారు. విపరీతంగా ఖర్చు పెట్టారు. భారీ కాస్టింగ్.. కట్ చేస్తే సినిమాకు ప్లాప్ టాక్. విచిత్రం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహోకు నెగిటివ్ టాకే వచ్చింది. బాలీవుడ్లో మాత్రం టాక్‌తో సంబంధం లేకుండా ఏకంగా రు. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదే సాహోను గట్టెక్కించేసింది. సాహో బాలీవుడ్ విజయంతోనే అందరూ హ్యాపీ అయ్యారు.
ఇక ఇప్పుడు రాధేశ్యామ్ వరల్డ్ వైడ్‌గా రు. 205 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఏపీ, తెలంగాణలోనే ఈ సినిమా రు. 105 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఏపీ, తెలంగాణలో ఈ సినిమా కొన్నవారు సేఫ్ అవ్వాలంటే రు. 150 కోట్ల పై చిలుకు గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. ఇక హిందీ బెల్ట్‌లో రాధేశ్యామ్‌ను రు. 54 కోట్లకు మార్కెట్ చేశారు.
రాధేశ్యామ్‌కు ముందు వచ్చిన సాహోకు ఓవరాల్‌గా రు. 300 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అప్పుడు బాహుబలి ది కంక్లూజన్ వసూళ్లు చూడడంతో పాటు సాహో భారీ కాస్టింగ్ ఇవన్నీ కలిసి ఆ సినిమాకు ఆ రేంజ్లో బిజినెస్ జరగడంలో కీలకపాత్ర పోషించాయి. ఏదేమైనా మరీ రాధేశ్యామ్ ఏ రేంజ్‌లో వసూళ్లు రాబడుతుంది ? ప్రభాస్ స్టామినాను ఎంత వరకు కంటిన్యూ చేస్తుంది ? అన్నది చూడాలి.