‘రాధేశ్యామ్’..గత కొన్ని రోజుల నుండి ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. అఫ్కోర్స్ ..మన డార్లింగ్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుందిలేండి. కానీ ఎక్స్ పెక్స్ట్ చేసిన దానికన్నా కూడా..డబుల్ హైప్ ని తీసుకొచ్చింది..ఈ మూవీ. దానికి రీజన్స్ చాలా నే ఉన్నాయి. ఇప్పటి వరకు తెర పై చూడని విభిన్నమైన స్టోరీ తో ఈ కధను తెరకెక్కించాడు డైరెక్టర్ రాధకృష్ణ. పైగా బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సాహో సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం తో రెబల్ అభిమానులు మంచి ఆకలి మీద ఉన్నారు.
ఎలాగైన ఈ సినిమాతో ప్రభాస్ చరిత్ర సృష్టించాలని వెయిట్ చేస్తున్నారు. కాగా, ప్రభాస్ కూడా ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఇక ఈయన అటెండ్ అయ్యే ప్రతి ఇంటర్వ్యుల్లోను ప్రభాస్ కు ఓ ప్రశ్న ఖచ్చితంగా ఎదురుఅవుతుంది. అదే ..ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని..? ..‘రాధేశ్యామ్’ సినిమాకి సంబంధించిన ఏదైన ప్రశ్నని అడగటం అయినా మర్చిపోతారు ఏమో కానీ..ఆయన పెళ్లి విషయాని అడగటం మాత్రం మర్చిపోరు. దీని బట్టి అర్ధం చేసుకోండి..ప్రభాస్ పెళ్ళి చేసుకుంటే చూడాలని..ఎంత మంది వెయిట్ చేస్తున్నారో..!
కాగా, తాజాగా ‘రాధేశ్యామ్’ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రభాస్‌కు తన పెళ్లి గురించి ప్రశ్న ఎదురవ్వగా..ఆయన ఫన్నీ ఆన్సర్స్ ఇస్తూ కాసేపు సరదాగా నవ్వించేశాడు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రభాస్..బాహుబలి సినిమా తర్వాత తనకు 5వేల పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని చెప్పి షాక్ ఇచ్చాడు.
పెళ్ళి ప్రపోజల్స్ మాట పక్కన పెడితే వాళ్లల్లో తనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని వెత్తుకోడానికి చాల కన్ఫ్యూజన్ అయ్యాను అని అన్నారు. ఫైనల్ గా షాకింగ్ టచ్ ఇస్తూ తాను ప్రేమ పెళ్ళే చేసుకుంటానని క్లారిటీ ఇచాడు. అయితే అది ఎప్పుడు అన్నదానిపై మాత్రం ఖచ్చితంగా చెప్పలేనని బదులిచ్చాడు. దీంతో మరోసారి ప్రభాస్ అనుష్క పెళ్లి ప్రస్తావన హాట్ టాపిక్ గా మారింది.