యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు మన తెలుగు హీరో మాత్రమే కాదు.. ఓ పాన్ ఇండియా సూపర్ స్టార్. ప్రభాస్ ఓకే చెప్పాలే కాని.. అతడితో సినిమాలు చేసేందుకు సౌత్ టు నార్త్ అగ్ర దర్శకులు, బడా బడా బ్యానర్లు క్యూలో ఉన్నాయి. బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత ప్రభాస్ రేంజ్ ఎలా మారిపోయిందో చూస్తూనే ఉన్నాం. బాహుబలి రెండు సినిమాలు ప్రభాస్‌ను ఒక్కసారిగా నేషనల్ స్టార్‌ను చేసేశాయి. బాహుబలి సినిమా దెబ్బతో ప్రభాస్ రేంజ్ దేశం దాటేసి ఎక్కడికో వెళ్లిపోయింది.
ఇప్పుడు ప్రభాస్ తిరుగులేని స్టార్డమ్తో సినిమా ఇండస్ట్రీలను ఏలేస్తున్నాడు. మహామహా స్టార్ హీరోలే ప్రభాస్‌ను చూసి బయపడే పరిస్థితి వచ్చింది. అసలు ఇప్పుడు ప్రభాస్ లైనప్‌లో మామూలు సినిమాలు లేవు. రాధేశ్యామ్ తర్వాత వచ్చే సంక్రాంతికి ఆదిపురుష్ వస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా బడ్జెట్ రు. 300 కోట్లు అంటున్నారు. సైఫ్ ఆలీఖాన్ లాంటి నటుడిని ఈ సినిమాలో ప్రభాస్ ఢీ కొట్టబోతున్నాడు.
ఆ తర్వాత నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె వస్తోంది. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఎంతన్నది తెలియకపోయినా ఓవరాల్‌గా రు. 500 కోట్లు అని అయితే ప్రచారం జరుగుతోంది. ఇక కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉంది. ఇలా అన్నీ పాన్ ఇండియా సినిమాలే లైన్లో పెడుతున్నాడు.
ఇలాంటి టైంలో సడెన్‌గా మారుతి డైరెక్షన్లో ఓ సినిమాకు ఓకే చెప్పడం.. దానికి కూడా కేవలం 50 రోజుల కాల్షీట్లు మాత్రమే ఇచ్చారన్న ప్రచారం ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సినిమాకు
రాజా డీలక్స్ టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారని వార్తలు వచ్చాయి. అయితే అసలు టైటిల్ ఇది కాదట. ఇది జస్ట్ వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్‌కు తగిన టైటిల్ ఇది ఎంత మాత్రం కాదని.. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే టైంలో ఈ సినిమా టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట.
అన్ని భాషలకు యాప్ట్ అయ్యేలా సింగిల్ టైటిల్‌ను పెడతారని టాక్ ? త్వరలో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఈ సినిమాలో ప్రభాస్ పక్కన ముగ్గురు హీరోయిన్లు నటిస్తారు. థమన్ సంగీతం అందించే ఈ సినిమాకు అందరూ హై టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్లే వర్క్ చేస్తారని అంటున్నారు. మారుతి లాంటి డైరెక్టర్‌తో ప్రభాస్ పాన్ ఇండియా సినిమా అంటే రిస్క్ అనేవాళ్లు ఉన్నారు. మరి మారుతి – ప్రభాస్ మ్యాజిక్ ఎంత వరకు పని చేస్తుందో ? చూడాలి.